పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
మర్పల్లి మాజీ జడ్పీటీసీ మధుకర్
మర్పల్లి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 3): అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మర్పల్లి మాజీ జడ్పీటీసీ మధుకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం మర్పల్లి మండల కేంద్రంలోని ఎంసీఏ ఫంక్షన్ హాల్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టభద్రుల ఓటరు నమోదు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…m త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత అర్హత తేదీకి కనీసం మూడు సంవత్సరాల ముందు డిగ్రీ లేదా సమానమైన అర్హత పొందిన వారు, సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసితులై ఉంటే పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఒక్క పట్టభద్రుడు కూడా ఓటరు నమోదుకు దూరం కాకుండా గ్రామాల వారీగా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.పట్టభద్రుల ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యత అని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల సమయంలో తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయాలని మధుకర్ అన్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులందరి నమోదు పూర్తయ్యేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, సీనియర్ నాయకులు బట్టు రమేష్, మంగలి రమేష్, మాజీ యూత్ అధ్యక్షుడు మధుకర్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సోహైల్, నాయబ్‌గౌడ్, మాజీ సర్పంచ్ జైపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పాండు, పిర్యా నాయక్, మైనారిటీ నాయకులు షఫీ, ఉపసర్పంచ్ మోహన్, సోషల్ మీడియా వికాస్, నాయకులు చంటి, అనంతి, బాలేష్, వీరేశం గౌడ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ రాములు.
Also Read: అంత్యక్రియలకు వెళ్తూ అనంతగిరి ఘాట్‌లో ఘోర ప్రమాదం