BREAKING
SIRపై గుంతకల్లులో విపక్షాల నిరసన, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ జల్ పల్లి కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గ్రాడ్యుయేట్లు బాధ్యతగా ఓటరు నమోదు చేసుకోవాలి: కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గాంధీ ఆశయాలకు బీజేపీ కట్టుబడి ఉంది: బండి సంజయ్ జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి- ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ హనుమాన్ చాలీసా చదువుతూ విమానాన్ని కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్ బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయం పోలుకొండలో గాంధీ జయంతి వేడుకలు కౌటాల మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మంగళగిరికి చేరుకున్న సేవా సంకల్ప యాత్ర వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేయలి - - ఎఫ్ డీ వో కడారి అనిత గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించాలి తిర్యాణి ఎమ్మార్వో కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు - మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నాటి యువగళం హామీ...నేడు నెరవేరింది ఇలా!

గాంధీజీ జీవితం నుంచి ఓర్పు, సహనం* *జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి*

Select Suryaa Now
గాంధీజీ జీవితం నుంచి ఓర్పు, సహనం*  *జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి*

పార్వతీపురం, అక్టోబర్ 2 మేజర్ న్యూస్:స్వర్గీయ మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి ఉత్సవాలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.

స్వర్గీయ మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి జ్యోతి ప్రజ్వలన పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి గొప్ప మహనీయుల జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో పవిత్రమైన రోజని పేర్కొన్నారు. మనం ప్రతి ఒక్కరు ఈ మహానాయకుల జీవితాల నుంచి అనేక విషయాలు నేర్చుకొని, వారు చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.
గాంధీజీ జీవితం నుంచి ఓర్పు, సహనం అనేవి ప్రధానంగా నేర్చుకోవలసిన అంశాలని కలెక్టర్ తెలిపారు. ఎంతటి బలమైన బ్రిటీష్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, గాంధీజీ ఎంతో ఓర్పుతో, పట్టుదలతో తాననుకున్న లక్ష్యాన్ని వీడకుండా అనేక సంవత్సరాల పాటు పోరాటం సాగించారని గుర్తుచేశారు. ఎన్ని ఇబ్బందులు, జైలు శిక్షలు ఎదురైనా దేశ స్వాతంత్ర్యం కోసం నిలబడటం ఎంతో ఆదర్శనీయమన్నారు. ఈ తరం ప్రజలు, యువత వారిని ఆదర్శంగా తీసుకొని సరైన మార్గంలో నిలకడగా, ఓర్పుగా  ముందుకు సాగాలని సూచించారు.

అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితం నుంచి నిరాడంబరత,  నిజాయితీ  వంటి గుణాలను అలవర్చుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎంతటి ఉన్నతమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయన ఎంతో సాధారణ జీవితాన్ని గడిపారని, నమ్మిన సిద్ధాంతాల కోసం గట్టిగా నిలబడ్డారని ప్రశంసించారు.
మనం వారి గొప్పతనాన్ని, భావాలను తర్వాతి తరాలకు అందించడమే కాకుండా, వారు చూపిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, పార్వతీపురం సబ్ కలెక్టర్ సచ్చిత్, పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నల్ పవార్, డిఆర్ఒ హేమలత, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.