BREAKING
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతిపత్రం.. గుంట్లపేట్‌లో రీ-సర్వే పనుల పరిశీలన మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. హార్టికల్చర్ హబ్ సీమ రూపురేఖలు మార్పు -రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం పాతబస్తీ లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది* – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డ్రై డే నాడు కూడా మద్యం ఏరు... బీసిల రిజర్వేషన్లపై రాద్ధాంతం తగదు బిజెపి నేత గాలి హరిప్రసాద్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మునుగోడులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. ధర్మవరంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు * గాంధీజీ ఆశయ సాధనకు తెదేపా కట్టుబడి ఉంది: ధర్మవరం తెదేపా నాయకులు * స్థానిక ఎన్నికలను అడ్డుకుంటూ బీసీల రాజ్యాధికారాన్ని కాలరాస్తున్న వైకాపా * బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుకెళ్లడం వైకాపా నైజం: తెదేపా ధ్వజo జీలుగుమిల్లి మండలం దర్భగూడెం లో ఇటివల జరిగిన పిల్లెం. వెంకయ్య హత్య కేసు ను చేధించిన పోలీసులు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవం

చిన్నారులకు పౌష్టికాహారం.. ‘తొలి ముద్ద’కు శ్రీకారం

Select Suryaa Now
చిన్నారులకు పౌష్టికాహారం.. ‘తొలి ముద్ద’కు శ్రీకారం

అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభం

వికారాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 2):చిన్నారులకు పౌష్టికాహారం అందించి వారి సంపూర్ణ వికాసానికి తోడ్పడే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తొలి ముద్ద’ కార్యక్రమాన్ని వికారాబాద్‌లో ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ వికారాబాద్ ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రామయ్యగూడ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జడ్పీ సీఈఓ సుధీర్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల శారీరక, మానసిక, భావోద్వేగ వికాసానికి సమతుల్యమైన పోషకాహారం ఎంతో అవసరమన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం చేపట్టిన ‘తొలి ముద్ద’ కార్యక్రమం ద్వారా చిన్నారులకు రోజువారీ పోషక అవసరాలను తీర్చే విధంగా అల్పాహారం అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధా సుధాకర్ రెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ జగదీశ్వరి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె. కాంతారావు, సీడీపీఓ ఈ. శ్రీలత, సూపర్‌వైజర్ షాలిని, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.