జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి
• పేదలకు పండ్లు పంపిణీ చేసిన బాజీ బాబా
విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 2, మేజర్ న్యూస్, ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని నైజాం గేట్ సెంటర్‌లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, మైనారిటీ నాయకులు బాజీ బాబా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాజీ బాబా మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి విలువలను గాంధీజీ తన జీవితాంతం ఆచరించి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ నాయకత్వం దేశ ప్రజల్లో ఐక్యత, స్వాతంత్ర్య కాంక్షను బలపరిచిందని, అహింసా మార్గంలో ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన అందించిన నాయకత్వం భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. గాంధీజీ కలలుగన్న సమాజంలో పేదలు, బలహీన వర్గాలు, మైనారిటీలతో సహా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, హక్కులు, అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజల జీవితాల్లో ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ డైరెక్టర్ డేరంగుల రమణ, క్రిస్టియన్ మైనారిటీ పచ్చిమా అధ్యక్షుడు బత్తుల పాండు, పశ్చిమ మహిళా అధ్యక్షురాలు భవాని, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గోలగాని శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్ వింగ్ ప్రధాన కార్యదర్శి పైడా శ్రీనివాసరావు, రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగం ప్రధాన కార్యదర్శి ఏనుగుల సునీల్, జిల్లా కార్యదర్శి మజ్జి శీను, జిల్లా మైనారిటీ కార్యదర్శి నజీరుద్దీన్, జిల్లా కార్యదర్శి షేక్ అహ్మద్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అబ్దుల్ గని, డివిజన్ ఎస్సీ అధ్యక్షుడు పల్లె బాబు, మైనారిటీ నాయకులు అబ్దుల్ సత్తార్, అబ్దుల్ రెహమాన్, షేక్ బాషా, సయ్యద్ జాకీర్ రసూల్, అబ్దుల్లా గౌసి, ఖాదర్ బాషా, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.