ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ
పటాన్ చెరు;ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా గాంధీ మహాత్ముడి జయంతి వేడుకల ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పఠాన్ చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ లో గల మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక నాయకులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస పద్ధతుల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన మహోన్నత నాయకుడు మాత్మ గాంధీ అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. నేటి తరాలకు మహాత్మా గాంధీ చరితను తెలియజేసే విధంగా ప్రతి గ్రామపంచాయతీ ఆవరణలో విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో సైతం ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, వెంకటేష్, హమీద్, నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.