మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం -మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష
-నంద్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
-నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష
నంద్యాల అర్బన్:మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని, ఆయన ఆశయాలను అనుసరించడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాష లు పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు గాంధీజీ అహింసను ప్రధాన ఆయుధంగా మలచుకుని సాగించిన పోరాటం ప్రపంచానికే ఆదర్శనమన్నారు. నాటి త్యాగధనుల జీవితాలను, వారి సేవాభావాలను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేటి రాజకీయ నాయకులు కేవలం పదవుల కోసం కాకుండా, దేశాభివృద్ధి కోసం పాటుపడిన నాటి నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఈసీ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నీసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, మాజీ కౌన్సిలర్లు మునయ్య, అమృతరాజ్, జాకీర్, ఆరిఫ్ నాయక్, కలాం మరియు వైఎస్సార్సీపీ నాయకులు గన్నీ కరీం, జలీల్, గోపాల్ రెడ్డి, కాల్వ నాగరాజు, టీవీ రమణ, ఆంజనేయులు, నెరవాటి రవి తదితరులు పాల్గొన్నారు.