BREAKING
114 రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఖరారయ్యే అవకాశం, వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ వెల్లడి మదుపర్లను ఆందోళనకు గురిచేస్తున్న సరికొత్త ఆర్థిక సవాళ్లు నెస్లే లో ఫ్యాట్ డెయిరీ వైట్‌నర్ నమూనా అసురక్షితమని తేల్చిన ల్యాబ్, ది లలిత్ హోటల్ నిర్వాహకులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసు మెటా మ్యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఆర్థిక వ్యవస్థలో ఎదురయ్యే సవాళ్లపై నిరంతర నిఘా: వ్యవస్థ సుస్థిరతకు ఆర్బీఐ కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం! మెడికేర్ సీనియర్లకు 90 డాలర్ల వన్-టైమ్ చెల్లింపు ప్రకటించిన ట్రంప్ కర్జన్ సీఎన్‌జీ స్టేషన్‌లో కారు సిలిండర్ పేలుడు ..తప్పిన పెను ప్రమాదం బీసీల ప్రయోజనాలను రాజకీయాలకు వాడుకోవద్దు అమెరికాలో వాహన ఇంధన సామర్థ్య నిబంధనల వివాదం నెదర్లాండ్స్‌లో మెటా స్మార్ట్ గ్లాసెస్ అమ్మకాలను నిలిపివేసిన హన్స్ ఆండర్స్ కెన్యాలో డాంగోటే భారీ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్‌కు చుక్కెడు అమెరికా మార్కెట్లో దూసుకుపోతున్న ఈటీఎఫ్‌లు కృత్రిమ మేధ రంగంలో ఆర్థిక భారం ఆధార్‌ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో ఐరోపా యూనియన్‌పై చైనా యాంటీ డంపింగ్ దర్యాప్తు

రాజకీయ కక్షలతో 'శిల్పా' సేవలను ఆపలేరు: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

Select Suryaa Now
రాజకీయ కక్షలతో 'శిల్పా' సేవలను ఆపలేరు: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

-మహిళా బ్యాంక్ ఆధ్వర్యంలో 168 మంది లబ్ధిదారులకు 33.36 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ
-ఎన్నికల గెలుపోటములతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి
-రాజకీయ కుట్రలను ప్రజలే గమనించాలి

నంద్యాల అర్బన్: రాజకీయ కక్ష సాధింపులతో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో నంద్యాల ప్రజలకు దశాబ్దాలుగా అందిస్తున్న ప్రజాసేవను ఎవ్వరూ ఆపలేరని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక శిల్పా సేవా సమితి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 168 మంది మహిళా లబ్ధిదారులకు 33లక్షల,36 వేల రూపాయల విలువైన రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా నంద్యాలలోని పేదింటి మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం శిల్పా మహిళా సహకార బ్యాంక్ ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని, స్వయం సమృద్ధి సాధించడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రాజకీయంలో గెలుపోటములు సహజమని, కుట్రలు, ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా శిల్పా సేవా సమితి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నందుకు గర్విస్తున్నామని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టేక్కే మార్కెట్ యార్డ్‌లో తాము క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్న షాపులను కూడా ఖాళీ చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పేదలకు నిత్యావసర సరుకులను 10 శాతం తక్కువ ధరకు అందించాలనే సదుద్దేశంతో, నిబంధనల ప్రకారం నెలకు ఒక్కో దుకాణానికి 3వేలు అద్దె చెల్లిస్తూ సేవలు అందిస్తుంటే నిరంకుశంగా బయటకు నెట్టేశారన్నారు. కానీ, నీతులు చెప్పే పెద్దమనుషులు కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ మార్కెట్ యార్డ్‌‌లోని రెండెకరాల స్థలాన్ని టీడీపీ పార్టీ కార్యాలయం కోసం సంవత్సరానికి కేవలం వెయ్యి రూపాయలకు లీజు చొప్పున 100 సంవత్సరాలకు తీసుకోవడం ఏ రకమైన న్యాయమో ప్రజలే ఆలోచించాలి" అని ప్రశ్నించారు. సేవా కార్యక్రమాలను మూసివేయించాలని ఎంత ఒత్తిడి తెచ్చినా, తమ నిర్ణయం ప్రకారం భవిష్యత్తులోనూ ప్రజాసేవను కొనసాగించి తీరతామని స్పష్టం చేశారు. బ్యాంక్ ద్వారా రుణాలు పొందిన ప్రతి అక్కచెల్లెమ్మలు ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, బ్యాంక్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో మహిళా ఖాతాదారులు పాల్గొన్నారు.