ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు
-మహిళలు, చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన
-నియంత్రణ,రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన
-పోక్సో చట్టం, బాల్య వివాహాలు, చైల్డ్ పోర్నోగ్రఫీపై అవగాహన
-అత్యవసర పరిస్థితుల్లో డయల్- 112కు సమాచారం ఇవ్వాలి
నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు పోలీసు అధికారులు వారి సిబ్బంది విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సూచనలతో సంబంధిత పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసు అధికారులు వారి సిబ్బంది మరియు శక్తి టీం బృందాలు ఈగల్ టీం సిబ్బంది జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ అధికారులు మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన పరిణామాలను వివరించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ, బాల్య వివాహాలు,పోక్సో చట్టం, రహదారి భద్రతా, ట్రాఫిక్ నిబంధనలు, మరియు ఉల్లంఘించడం వలన కలిగే పరిణామాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై నేరాలకు సంబంధించి అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ప్రజల భద్రత, నేరాల నివారణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.