BREAKING
గాంధీజీ, శాస్త్రిల ఆశయ సాధనకు పునరంకితం కావాలి : మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘనంగా మహాత్మా గాంధీ జయంతి. ఊటాడలో ఉపాధి శ్రామికులంతా ఒకే చోట ఐక్యంగా భోజనాలు చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. రూ. లక్ష కోట్లతో రాయలసీమకు మహర్దశ.. ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా సీమ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైటెన్షన్.. కందుకూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి రాయలసీమను 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేష్ శపథం కరవుతో కాదు.. అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు శంషాబాద్‌లో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు గాంధీజీ ఆశయాలను ఆచరించాలి, గాంధీ విగ్రహానికి టీడీపీ నాయకుల నివాళులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వినతి పత్రాలు అందజేసిన APUWJ * మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించిన యూనియన్ నేతలు * పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జిల్లా APUWJ ఆధ్వర్యంలో కార్యక్రమం ఓబీసీ కులగణన సాధనకు మైలార్‌దేవపల్లిలో సన్నాహక సమావేశం మదనపల్లెలో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్'కు శ్రీకారం.. రూ. లక్ష కోట్లతో రాయలసీమ రూపురేఖలు మార్చే బృహత్ ప్రాజెక్టు జైనూర్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జీవన విధానాన్ని అనుసరించాలి *

గాంధీజీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం

Select Suryaa Now
గాంధీజీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం

నేటి దినపత్రిక సూర్య బ్యూరోరాజమహేంద్రవరం ;గాంధీజీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దానవాయిపేట చిన్న గాంధీ బొమ్మ, కంబాల చెరువు సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని గాంధీజీకి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అహింస, శాంతి, సత్యం, ప్రజాస్వామ్య విలువలను గాంధీజీ ప్రపంచానికి అందించిన గొప్ప సందేశాలని, ఆయన స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 దేశం నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి గాంధీజీ వంటి మహనీయుల త్యాగాలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే గాంధీజీ చూపిన మార్గమని, అదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ప్రజల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, ప్రజల భాగస్వామ్యం, బలమైన స్థానిక సంస్థల వ్యవస్థ దిశగా కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోందని, ఎన్నికలు జరిగిన అనంతరం స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన స్థానిక సంస్థల వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించి, 15వ, 16వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.