ధర్మవరంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు * గాంధీజీ ఆశయ సాధనకు తెదేపా కట్టుబడి ఉంది: ధర్మవరం తెదేపా నాయకులు * స్థానిక ఎన్నికలను అడ్డుకుంటూ బీసీల రాజ్యాధికారాన్ని కాలరాస్తున్న వైకాపా * బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుకెళ్లడం వైకాపా నైజం: తెదేపా ధ్వజo
ధర్మవరం రూరల్ అక్టోబర్ 2 మేజర్ న్యూస్ ;ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను గురువారం పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న గాంధీజీ విగ్రహానికి తెదేపా నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందించిన బాపూజీ కన్న కలలను సాకారం చేయడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని నాయకులు పేర్కొన్నారు.
అనంతరం గాంధీనగర్ సర్కిల్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 34% రిజర్వేషన్లను అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేయించడం వైకాపా దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి నిధులు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దాంతో తమ ఉనికి కోల్పోతామనే భయంతోనే వైకాపా ఈ ఎన్నికలను అడ్డుకుంటోందని విమర్శించారు.
ఎన్టీఆర్ కాలం నుంచే తెదేపా బీసీల పక్షపాతిగా నిలిచిందని, ఏ పరిస్థితుల్లోనైనా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేలా సీఎం నారా చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టులో ప్రతికూలత ఎదురైనా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు కేటాయించి పోటీకి దిగుతామని తెదేపా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కమతం కాటమయ్య మహేష్ చౌదరి పరిసే సుధాకర్ సంధ రాఘవ, ఫణి కుమార్ , పురుషోత్తంగౌడ్ కొత్తపేట ఆది అంబటి సనత్ జింకా పురుషోత్తం బొట్టు కిష్ట, తలారి రమేష్, బట్ట ధనుంజయ నాయుడు, పటాన్ బాబు ఖాన్ విజయ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు