సత్యం.. అహింసే గాంధీజీ చూపిన మార్గం: కాట సుధా శ్రీనివాస్ గౌడ్
అమీన్‌పూర్: సత్యం, అహింసా సిద్ధాంతాలతో దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీ ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అమీన్‌పూర్ గ్రామంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగానివాళులర్పించారు.సత్యాన్ని మించిన ఆయుధం లేదని, అహింసను మించిన పోరాట మార్గం లేదని గాంధీజీ చాటిచెప్పారని ఆమె పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.