పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ నాయకులు
అనంతపురం బ్యూరో: కదిరిలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో కలిసి భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పెన్షన్ లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను సేకరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్, పట్టణ అధ్యక్షుడు పీట్ల రామకృష్ణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ సమీవుల్లా, జిల్లా కార్యదర్శి కొత్త రమేష్ బాబు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గోవర్ధన్, మాజీ జిల్లా కార్యదర్శి అశోక్, సీనియర్ నాయకులు కద్దర్ వెంకటరమణ, బీజేవైఎం రాష్ట్ర నాయకులు హరినాథ్ నాయుడు, రూరల్ మండల ఉపాధ్యక్షుడు వెంకట చలపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి బుడగల హరీష్‌తో పాటు వెంకటేష్, ప్రదీప్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ప్రజల సేవే ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తెలిపారు.