BREAKING
ఒడిశాలో దారుణం: చేతబడి నెపంతో 54 ఏళ్ల మహిళపై కర్కశ దాడి జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్‌ 2న నిరసన నాగార్జున గీతాంజలి మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి థియేటర్లలోకి మణిరత్నం క్లాసిక్ మాస్టర్‌పీస్ పరిశుభ్ర నగర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకం ప్రకృతి వ్యవసాయ లక్ష్యాల సాధనకు సమిష్టిగా పని చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంపికలో సామాజిక న్యాయం ఎక్కడ? మహిళా భద్రతపై అవగాహన బిగ్‌బాస్ హౌస్‌లో ముసలం.. డ్యాగర్ల టాస్క్‌లో తారాస్థాయికి చేరిన గొడవలు 41 ఏళ్ల పోలీస్ సేవలకు ఎస్‌ఐ కె. గోపాల్ వీడ్కోలు బీసీల రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : సీఎం చంద్రబాబు అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నంద్యాల విద్యార్థి హర్షవర్ధన్ కేబీసీ షూటింగ్‌లో ప్రమాదం.. జారిపడ్డ అమితాబ్ బచ్చన్ మోకాలికి గాయం రిజల్యూషన్ ఎసోపగీల్ మానోమెట్రీ అను పరికరమును ప్రారంభించిన మంత్రి టీ.జి భరత్, గాంధీ జయంతి ఆంక్షలు అమలయ్యేనా..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని వీరేష్ ముదిరాజ్ రేసులో దూకుడు...?

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని వీరేష్ ముదిరాజ్ రేసులో దూకుడు...?

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 01): మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల రాజకీయం రాష్ట్రంలో అత్యంత రసవత్తరంగా మారుతోంది. మూడు జిల్లాల పరిధిలో లక్షలాది మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్న ఈ ప్రతిష్టాత్మక స్థారాన్ని గెలుచుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల సమరం అధికారికంగా ప్రారంభం కాకముందే అభ్యర్థుల ఎంపికపై గులాబీ దళం కసరత్తును ముమ్మరం చేసింది. పార్టీ అధిష్టానం ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడిని బరిలోకి దింపాలని ప్రణాళిక రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ స్థానం కోసం సామ రామ్మోహన్ రెడ్డి పేరును ఖరారు చేసి దూకుడు పెంచగా, అధికార ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కాసాని వీరేష్ ముదిరాజ్ పేరును ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం వెలువడింది. గులాబీ పార్టీ అనుసరిస్తున్న ఈ సరికొత్త సామాజిక సమీకరణాల వ్యూహం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల నియోజకవర్గంలో బలమైన పట్టు సాధించేందుకు, అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.మరోవైపు శాసనమండలి ఎన్నికల వేడి క్రమంగా శాసనసభ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుండటంతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాల్లో రాజకీయం వేడెక్కింది. పట్టభద్రుల సమస్యలపై స్పందిస్తూనే, అధికార పక్ష వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతుండటంతో రానున్న రోజుల్లో ఈ ఎన్నికల పోరు మరింత హోరాహోరీగా సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటన అధికారికంగా వెలువడిన తర్వాత ప్రచార పర్వం మరింత ఊపందుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.