ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి… ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి జోజి రెడ్డి
సూర్య కరీంనగర్:: ఎన్నికల సంఘం తన రాజ్యాంగ స్వతంత్రతను కాపాడుతూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి జోజి రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్ , ఫారం-6లో మార్పులు, ఎన్నికల కమిషన్‌లో నమోదైనట్లు వచ్చిన అభ్యంతరాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.సెప్టెంబర్ 26న భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనతో తలెత్తిన సందేహాలు తొలగలేదని, నిర్ణయాల ప్రక్రియపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని అన్నారు. అర్హత కలిగిన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.సర్ , ఫారం-6, కమిషన్‌లోని అభ్యంతరాలు, నిర్ణయాల ప్రక్రియపై సమగ్ర, స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతపై తలెత్తిన ప్రశ్నల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని అంబటి జోజి రెడ్డి కోరారు.