BREAKING
సేవా సంకల్ప్ అభియాన్ మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభం మరింత అభివృద్ధి, ప్రజాసేవే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలి* జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 2న మధిరలో ఆందోళన. మహిళా, శిశు సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట మంత్రి దామోదర్ రాజనర్సింహ పొలాల్లో నీటి గుంతలు.. భూగర్భ జలాలకు భరోసా బీసీల హక్కులకు భంగం కలిగిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. 34% బీసీ రిజర్వేషన్లు రద్దు! విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పై శాస్త్రీయ సర్వే.జిల్లా కలెక్టర్ మహేష్ కుమర్ వైసీపీ మాజీ మంత్రులకు ఆహ్వానం ఏపీ ప్రభుత్వ నిర్ణయం యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో కృషి చేయాలి* కూటమి హామీలపై ‘అడుగు’తో ప్రజల్లోకి వెళ్తాం: వైఎస్సార్‌సీపీ నాయకులు వెల్లడి పొదలకూరు పోలేరమ్మ జాతర.. గ్రామదేవత ఆరాధనకు ప్రతీక అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘సేవా సంకల్ప్ అభియాన్’

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి

-పోలూరు గ్రామంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

-సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టీకరణ

నంద్యాల అర్బన్:ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్‌ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో గురువారం నాడు ప్రజా సమస్యల వినతుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామంలోని వివిధ వర్గాల ప్రజలు, రైతులు తమ సమస్యలపై సమర్పించిన వినతిపత్రాలను (అర్జీలను) వారు స్వయంగా స్వీకరించారు. మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత మరియు సామూహిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత గడువులోగా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు . అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీవాణి , ఎంపీడీవో సుగుణ శ్రీ, పోలూరు గ్రామ టిడిపి నాయకులు పైరెడ్డి జోజీ రెడ్డి, జయ చంద్రారెడ్డి , కిరణ్ కుమార్ రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల మండలం టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, అర్ఫాత్ బాషా, అబ్దుల్లా, రామిరెడ్డి , హుస్సేన్ బాషా, అలీ అక్బర్ , ఖాదర్ బాషా, రాజా రెడ్డి , అర్షద్ బాషా, భూపాల్ రెడ్డి, అరుణ, సునీత , స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.