BREAKING
సిపిఎస్ రద్దు చేయాలి -పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలి తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, 2018 నుంచి పెండింగ్ లోని 48 నెలల డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ సిపిఎస్ ఎ ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి

పొదలకూరు పోలేరమ్మ జాతర.. గ్రామదేవత ఆరాధనకు ప్రతీక

Select Suryaa Now
పొదలకూరు పోలేరమ్మ జాతర.. గ్రామదేవత ఆరాధనకు ప్రతీక

పొదలకూరు,మేజర్ న్యూస్ :   గ్రామదేవతగా, శక్తి స్వరూపిణిగా భక్తులచే కొలువబడుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు పొదలకూరులో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తరతరాలుగా గ్రామీణ జీవనంతో ముడిపడిన గ్రామదేవతల ఆరాధనలో పోలేరమ్మకు విశిష్ట స్థానం ఉంది. పొదలకూరు పోలేరమ్మను గ్రామ ప్రజలను వ్యాధులు, ఆపదలు, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే అమ్మవారిగా భక్తులు విశ్వసిస్తూ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.పొదలకూరు పోలేరమ్మను గ్రామ రక్షక దేవతగా ఈ ప్రాంతం వారు ఆరాధిస్తారు.

పుట్టుపూర్వోత్తరాలపై పలు విశ్వాసాలు  :  పొదలకూరు కుమ్మరింట్లో పుట్టిన  శ్రీపోలేరమ్మ అమ్మవారి ఆవిర్భావానికి సంబంధించి ప్రాంతానుసారం పలు జానపద కథనాలు, విశ్వాసాలు ఉన్నాయి. గ్రామ పొలిమేరలకు రక్షణగా నిలిచే శక్తిగా, అంటువ్యాధుల నుంచి ప్రజలను కాపాడే గ్రామదేవతగా ఆమెను పూజించే సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నట్లు జానపద సంప్రదాయాలు చెబుతున్నాయి. పోలేరమ్మను శక్తి స్వరూపిణిగా భావించి పసుపు, కుంకుమ, వేపాకులతో పూజలు చేయడం మన సంప్రదాయం. పొదలకూరు పోలేరమ్మ జాతరకు సంబంధించి 90 ఏళ్ల తర్వాత జాతరను పునరుద్ధరించి నిర్వహిస్తున్నట్లు ల పేర్కొంటున్నారు.

చాటింపుతో ప్రారంభమైన సందడి   ఈ ఏడాది జాతరలో భాగంగా ఇప్పటికే మొదటి చాటింపు సెప్టెంబర్‌ 22న, రెండో చాటింపు సెప్టెంబర్‌ 29న నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మండల పెద్దలు, జాతర కమిటీ సభ్యులు, భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా సంగం రోడ్డు కూడలి, రామమందిరం సెంటర్, గేట్‌ సెంటర్ తదితర ప్రధాన కూడళ్లలో చాటింపు వేశారు.

జాతర ఇలా జరుగుతుంది :  అక్టోబర్ 6న ఘటోత్సవం   సంప్రదాయబద్ధంగా కుమ్మరి వారిచే తయారు చేసిన ఘటాలను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉంచి అలంకరించి, అమ్మవారిని ఆవాహనం చేసిన అనంతరం పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా భక్తులు తమ మొక్కుబడులను సద్ది రూపంలో ఘటాల్లో సమర్పించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఇదే రోజు రాత్రి పోలేరమ్మ మన్యంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పాట కచ్చేరి ఉంటుంది. అక్టోబర్ 7న ఘటాలను పురవీధుల్లో ఊరేగించిన అనంతరం సాయంత్రం అమ్మవారి పుట్టిల్లు అయిన నరసారెడ్డి కాలనీ నుంచి కుమ్మరి వారిచేసంప్రదాయబద్ధంగా తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా పోలేరమ్మ మాన్యం వద్దకు తీసుకువస్తారు. అనంతరం అర్ధరాత్రి 12 గంటల తర్వాత శాస్త్రోక్తంగా అమ్మవారికి కళ్ళు అమర్చి, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అక్టోబర్ 8న వేకువజామున పోలేరమ్మ మాన్యం వద్ద సంప్రదాయ కైంకర్యాలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని ఆలయం వైపు ఊరేగింపుగా తీసుకువస్తారు. శివాలయం వీధి ఎదురుగా అమ్మవారిని ఉంచి నాలుగు దిక్కులు చూపించే సంప్రదాయ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ ప్రజలు తమ ఇళ్ల వద్ద మొక్కుబడులను పొంగలి తదితర రూపాల్లో సమర్పించుకోవచ్చు.అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య అమ్మవారి ఎదుట నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమాలను పూర్తిచేసి, అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పోలేరమ్మ తల్లి ఆలయం నుంచి వీరంపల్లి రోడ్డులోని పొట్టేళ్ల వాగు వరకు గ్రామోత్సవం, నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఊరంతా ఒక్కటై జరుపుకునే పండుగ    పోలేరమ్మ జాతర కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా గ్రామ ప్రజల ఐక్యత, జానపద సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలు అమ్మవారి ఉత్సవాల్లో భాగస్వాములు కావడం ఈ జాతర ప్రత్యేకత. భక్తిశ్రద్ధలతో పూజలు, మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వహకులు కోరుతున్నారు.