అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘సేవా సంకల్ప్ అభియాన్’
అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘సేవా సంకల్ప్ అభియాన్’
కొండాపూర్ ; ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని మల్కాపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సూచనలతో మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు.అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందిని సన్మానించి, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యాబోధన, ఇతర సేవలను పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించి, అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు, మాజీ సర్పంచ్ గొల్ల సత్యమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా నాయకుడు సందీప్ గౌడ్, మండల నాయకులు విష్ణువర్ధన్, మల్లేశం, కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు