BREAKING
ప్రతి ఇంటికి సోలార్ ను ఏర్పాటు చేసుకోండి : విద్యుత్ శాఖ డిఈటి రాజు నాయక్ గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ప్రజలకు అంకితభావంతో సేవలందించాలి రాజ్యాంగ విలువలే గాంధీజీ ఆశయాలకు నిదర్శనం "స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి - కాకాణి" బీసీలకు 34% రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేదే లేదు: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ * బీసీల సామాజిక న్యాయం, సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం * రిజర్వేషన్లు దక్కే వరకు న్యాయపోరాటం – సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రమాదవశాత్తు రేవులో పడి బాలుడు గల్లంతు ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి : జిల్లా కలెక్టర్ ప్రియాంక బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం.. 34 శాతం సాధించి తీరుతాం: టీడీపీ నాయకులు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శిగా వి. సురేష్ బాబు భక్తిశ్రద్ధలతో రాజరాజేశ్వరి అమ్మవారికి రాహుకాల పూజలు ఎంపీఎస్సీ కార్యదర్శి మహేంద్ర హర్పాల్కర్ డిప్యుటేషన్ రద్దు, అభ్యర్థుల ఆందోళనకు తలొగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు.. నెల్లూరు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం శ్రీధర్ ప్రజలకు సేవలందిస్తున్న ఆశా, అంగన్‌వాడీ, ఆర్‌పీలు, మహిళా సంఘాల ప్రతినిధుల సేవలు అభినందనీయం : ఎంపీ డీకే అరుణ, జిల్లా కలెక్టర్ ప్రియాంక. పెంచలకోన స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి

మహిళలు రక్తహీనతకు గురి కాకుండా జాగ్రత్త వహించాలి-రెడ్ క్రాస్ ట్రెజరర్ డాక్టర్ అరుణకుమారి

Select Suryaa Now
మహిళలు రక్తహీనతకు గురి కాకుండా జాగ్రత్త వహించాలి-రెడ్ క్రాస్ ట్రెజరర్ డాక్టర్ అరుణకుమారి

నంద్యాల అర్బన్: అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా గురువారం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మహిళలకు రక్తదానం రక్తహీనత పై అవగాహన సదస్సు మరియు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. నంద్యాల సంజీవనగర్ లోని కేర్ బ్యూటీ పార్లర్ మరియు ట్రైనింగ్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ట్రెజరర్ డాక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యాన్ని సంరక్షించుకొని రక్త గ్రహీతలుగా కాకుండా రక్తదాతలుగా ఎదగాలని పిలుపు ఇచ్చారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సూచన మేరకు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల  పర్యవేక్షణలో రెడ్ క్రాస్, కేర్ బ్యూటీ అస్తెటిక్స్  మరియు ట్రైనింగ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మొదటి విడతగా దాదాపు 50 మంది మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 50 మంది మహిళలకు హిమోగ్లోబిన్ శాతం, బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం కాకుండా రక్తదానము మరియు రక్తహీనత అనే అంశాలపై రెడ్ క్రాస్ ట్రెజరర్ ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ అరుణ కుమారి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కేర్ బ్యూటీ అస్తెటిక్స్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు వసంత, లక్ష్మీ ప్రసన్న మరియు రెడ్ క్రాస్ సీనియర్ నాయకులు సోహేల్, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్, సరిత, శిక్షణకు హాజరైన మహిళలు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ అరుణ కుమార్ మాట్లాడుతూ ఈరోజు నుండి పది రోజులు పాటు నంద్యాల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు రక్తదానంపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.