BREAKING
వత్సవాయిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు మహాత్మా గాంధీకి ఆర్యవైశ్య సంఘం ఘన నివాళులు మండలంలో 69పాఠశాలల ఎన్నికలు పూర్తి లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు, ఆదర్శాలు యువతకు స్ఫూర్తిదాయకం.. ప్రజా సేవకు చిరునామా : మద్దినేని గాంధీ, శాస్త్రిలకు ఘన నివాళులు ,మహాత్ముడి గ్రామ స్వరాజ్య ఆశయాలను జగనన్న సాకారం చేశారు రైల్వే లైన్ నిర్మాణం నిధుల విడుదలను స్వాగతిస్తున్నాను.. మాజీ పార్లమెంట్ సభ్యులు డా. పి. రవీంద్ర బాబు.. పల్లె పండుగ తో గ్రామ అభివృద్ధికి కొత్త ఊపిరి తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు జిల్లా స్థాయి అవార్డు అందుకున్న కార్యదర్శి అమలాపురంలో దసరా సందడి, చెడీ తాలింఖానా శిక్షణ ప్రారంభం.. పోరాట స్ఫూర్తిని చాటే సంప్రదాయ క్రీడకు సన్నాహాలు యువత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి. ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ,గాంధీ విగ్రహానికి వినతిపత్రం  ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం,కోడ్ ది బ్రెయిన్, కంట్రోల్ ది మోషన్ పై అవగాహన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి

బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం.. 34 శాతం సాధించి తీరుతాం: టీడీపీ నాయకులు

Select Suryaa Now
బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం.. 34 శాతం సాధించి తీరుతాం: టీడీపీ నాయకులు

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్
బీసీలకు అన్యాయం చేసేందుకు వైసీపీ కుట్రలు
బీసీల డీఎన్‌ఏ తెలుగుదేశం పార్టీదే.. స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్‌కు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

నెల్లూరు, మేజర్ న్యూస్  :   నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెంచు కిషోర్, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తల హరికృష్ణ మీడియా సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు (బీసీలకు) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రెండు రోజుల్లో ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెంచు కిషోర్, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తల హరికృష్ణ వెల్లడించారు. శుక్రవారం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

వైసీపీ కుట్రలను తిప్పికొడతాం  :  శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి, జీవో నంబర్లు 105, 1065 ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించిందని నాయకులు స్పష్టం చేశారు. అయితే, ప్రతిపక్ష వైసీపీ తమ అనుకూల వ్యక్తుల ద్వారా హైకోర్టులో పిటిషన్లు వేయించి, 50 శాతం మించకూడదనే నెపంతో రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేసిందని మండిపడ్డారు. కోర్టు తీర్పును గౌరవిస్తూనే, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఉన్నత న్యాయస్థానంలో గట్టిగా వాదనలు వినిపిస్తామన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టు నిర్ణయాలపై ముందుకు వెళ్లే ధైర్యం చేయలేదని, కానీ తమ ప్రభుత్వం బీసీల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు.

బీసీల అభ్యున్నతి తెలుగుదేశం డీఎన్ఏలోనే ఉంది  :  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసమని నాయకులు గుర్తుచేశారు. ‘1985, 1987లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు దానిని 34 శాతానికి పెంచారు. బీసీలు టీడీపీకి వెన్నెముక వంటివారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి బీసీల సంక్షేమంపై పూర్తి చిత్తశుద్ధి ఉంది’ అని స్పష్టం చేశారు.

స్థానిక పరిపాలనలో బీసీలకు ప్రాధాన్యం  :  నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నిరంతరం అండగా నిలుస్తున్నారని, రాజకీయావకాశాల్లో ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టులో కచ్చితంగా విజయం సాధించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగు దేశం నాయకులు ఆవుల రవిచంద్ర, తన్నీరు మధుబాబు, జయలక్ష్మి, బత్తల రమేష్‌, నల్లావుల శీనయ్య, బాలా కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.