"స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి - కాకాణి"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోట పల్లి గూడూరు మండలం, మండపం గ్రామంలో, 22 గ్రామపంచాయతీలకు సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై, స్పష్టమైన దిశా నిర్దేశం చేసిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్థన్ రెడ్డి
- చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది
- హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారు
- బాబు వస్తే అభివృద్ధి లేదు.. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది
- జగన్ గారి పాలనను మళ్లీ కోరుకుంటున్న ప్రజలు
- ప్రతి గ్రామంలోనూ వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజాదరణ మెరుగైంది
- గతంలో అభ్యర్థులు లేక స్థానిక ఎన్నికల నుండి పారిపోయిన చంద్రబాబు
- అధికారం లేకపోయినా ఎన్నికల్లో ధీటుగా పోటీకి జగన్ గారు సిద్ధం
- 175 నియోజకవర్గాల నేతలకు జగన్ గారు దిశానిర్దేశం చేశారు
- నిన్న 10 గంటల పాటు కూర్చొని జిల్లా అధ్యక్షులతో జగన్ గారు సుదీర్ఘ సమీక్ష చేశారు
- గ్రామస్థాయి నాయకుల సలహాలు, సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకెళ్తాం
నెల్లూరు,మేజర్ న్యూస్ : కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
తోటపల్లిగూడూరు మండలంలో ఇటీవల మండల స్థాయి సమావేశం నిర్వహించినట్లు కాకాణి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రామాల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక నాయకుల సూచనలు, సలహాలు స్వీకరించడానికి గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మండపం గ్రామ మాజీ సర్పంచ్ సుబ్బారావు నివాసంలో ఈ సన్నాహక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రకరకాల హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని కాకాణి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి పాలనపై ప్రజలకు నమ్మకం లేదని, ఆయన హమీ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏవీ అమలు కావడం లేదని విమర్శించారు. కూటమిపాలనలో చిన్నపాటి పనులు కూడా జరగడం లేదని, గ్రామాలలో ఎక్కడికి వెళ్లినా అవినీతి తప్ప అభివృద్ధి, సంక్షేమ జాడ లేదని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడగా ప్రతి గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ పరిస్థితి ఎంతో మెరుగ్గా, సంతృప్తికరంగా కనిపించిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలనను కోల్పోయామని ప్రజలు ఇప్పుడు భాదపడుతున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు అధికారంలో లేనప్పుడు పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక ఎన్నికలను బహిష్కరించి పారిపోయారని కాకాణి గుర్తుచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి గారు మాత్రం అధికారం లేకపోయినా ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి అధికారపక్షానికి ధీటుగా సమాధానం చెప్పాలనే ఆలోచనతో ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్ గారు 175 నియోజకవర్గాల నాయకులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. నిన్న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 10 గంటల పాటు ప్రతి జిల్లా అధ్యక్షులు రీజినల్ కోఆర్డినేటర్లతో కూర్చొని ఆయా జిల్లాల పరిస్థితులను క్షుణ్ణంగా సమీక్షించారని కాకాణి వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఊహించామని కాకాణి తెలిపారు. ఎన్నికల సమయం రాగానే చంద్రబాబు నాయుడు రకరకాల రాజకీయ విన్యాసాలు ప్రదర్శించడం అలవాటేనని దుయ్యబట్టారు. గత 28 నెలలుగా గుర్తురాని పెన్షన్లు, ఎన్నికలు రాగానే చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయని ఎద్దేవా చేశారు. పెన్షన్ల పేరుతో జాబితాలు సేకరిస్తున్నారని, ప్రజలకు పెన్షన్లు వస్తాయో రావో దేవుడికే ఎరుక అని వ్యాఖ్యానించారు. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా నిలువరించేందుకే పెన్షన్ల ఆశ చూపి చంద్రబాబు ఈ కుట్రలకు తెరలేపారని కాకాణి ఆరోపించారు చంద్రబాబు బీసీల కోసం జీవోల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు.. ఎన్నికలు రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బీసీలు గుర్తుకొస్తారని, వారిని మోసం చేయడానికే జీవోల పేరుతో కొత్త డ్రామాలకు తెరతీశారని కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
జీవోల పునరావృతం - కోర్టుల్లో రద్దు.. చంద్రబాబు బీసీలకు 34% రిజర్వేషన్లు పెంచామంటూ రెండు జీవోలను విడుదల చేసి హడావుడి చేశారని విమర్శించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోలను మాత్రమే చంద్రబాబు నెంబర్లు మార్చి కొత్తగా విడుదల చేశారని తెలిపారు. ఆ రోజుల్లోనే ఈ జీవోలపై తెలుగుదేశం పార్టీ నాయకుల చేత కోర్టులలో కేసులు వేయించి, ఆ జీవోలు హైకోర్టు మరియు సుప్రీం కోర్టుల్లో రద్దయ్యేలా చేశారని కాకాణి గుర్తుచేశారు, ఈ సమస్యకు కేవలం జీవోలు మాత్రమే కాకుండా చట్టం చేస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని తమ ప్రభుత్వం భావించిందని కాకాణి తెలిపారు. అయితే కరోనా పరిస్థితులు, ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో తాము భాగస్వాములం కాకపోవడంతో ఆ ప్రక్రియ పూర్తి చేయలేకపోయామని వివరించారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, కేంద్రం పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మళ్లీ పాత జీవోల డ్రామాలు ఆడుతున్నారని సుప్రీం కోర్ట్ కు వెళతానంటూ డాంభికాలు పలుకుతున్నాడని మండిపడ్డారు.
జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకు అగ్రపీఠం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత లభించిందని కాకాణి స్పష్టం చేశారు.ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్‌తో పాటు ఇద్దరు వైస్ చైర్మన్ల పదవులను సృష్టించి అవకాశాలు ఇచ్చారని,మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) తో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీలను,
మున్సిపల్ చైర్‌పర్సన్‌లతో పాటు ఇద్దరు వైస్ చైర్‌పర్సన్లను, కార్పొరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించి అందులో ఒకటి వారికి కేటాయించి సామాజిక న్యాయం చేశారని పేర్కొన్నారు.
మత్స్యకారులకు లభించిన గుర్తింపు.. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల పరిధిలోని మత్స్యకార కుటుంబాలకు చెందిన వ్యక్తులకు కూడా వైఎస్ జగన్ గారి హయాంలో వైస్ ఎంపీపీ (మండల వైస్ ప్రెసిడెంట్) లాంటి పదవులు దక్కాయని తెలిపారు. ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమయ్యాయని, చంద్రబాబు నాయుడు వల్ల బీసీల జీవితాల్లో ఎలాంటి పురోగతి రాదని కాకాణి తెగేసి చెప్పారు
ఎన్నికలకు చంద్రబాబు భయపడుతున్నారు.. ఐక్యంగా పనిచేసి విజయం సాధిద్దాం.. చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి భయపడుతున్నారని కాకాణి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు పెడితే ఓడిపోతామని, తమ అసలు స్వరూపం బయటపడుతుందనే భయంతోనే రకరకాల నెపాలతో ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు..హైకోర్టు ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కాకాణి గుర్తుచేశారు. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లి, ఏదో ఒక రకంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయించాలని చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తారని, ఏది ఏమైనా ఎన్నికలు జరగడం ఖాయమని, ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం..సమస్యల పరిష్కారం.. గ్రామాల్లో ఏమైనా సమస్యలు లేదా చిన్నపాటి మనస్పర్థలు, ఉంటే వాటిని పక్కన పెట్టాలని ఒకే తాటిపైకి రావాలని కోరారు,విబేధాలు ఏవైనా ఉంటే పక్కనబెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ మోహన్ రెడ్డి, పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి కోరారు
కార్యకర్తలే కొండంత బలం.. అధికారంలో లేనప్పుడు మనకు తోడు-నీడగా నిలిచేది మన తోటి నాయకులు, కార్యకర్తలేనని గుర్తుంచుకోవాలి.మనందరం మూకుమ్మడిగా, ఒకే మాటపై నిలబడి పోరాడితేనే ఎదుటివారు భయపడతారని, కాబట్టి ఐక్యంగా పనిచేసి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని కాకాణి పిలుపునిచ్చారు
కార్యకర్తలకు అండగా ఉంటాం.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తారో నిన్న వెంకటాచలంలో విద్యా కమిటీ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత జరిగిన ఉదాంతం ఒక ఉదాహరణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎన్నికలలో గెలిచినా, అధికారులను బెదిరించి ఎన్నికలను రద్దు చేశారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మరియు ఎస్ఐలు కలిసి హెచ్‌ఎంను బతిమిలాడి, "పైనుంచి ఒత్తిడి ఉందమ్మా" అని చెప్పి ఆమెను బయటకు తీసుకువెళ్లారు, అంటేనే పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు
"నాది వాచ్‌మెన్ డ్యూటీ.. ఎవరినీ వదిలిపెట్టం.."నాది వాచ్‌మెన్ డ్యూటీ. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా సరే.. ఎన్నికలు ముగిసే వరకు, ఆ తర్వాత కూడా రెండు నెలలు ఎక్కడికి వెళ్లకుండా జిల్లాలోనే, ఉంటూ , జిల్లాలో,సర్వేపల్లి నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటానని,ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు.
కార్యకర్తల అభిప్రాయాలకే పెద్దపీట.. జగన్ మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను గౌరవిస్తూ పార్టీ పనిచేస్తుందని ఆయన తెలిపారు. అందరం కలిసికట్టుగా మాట్లాడి, గ్రామాల వారీ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్దామని ,స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే ధ్యాసతో పనిచేయాలని పిలుపునిచ్చారు.