BREAKING
అమలాపురంలో దసరా సందడి, చెడీ తాలింఖానా శిక్షణ ప్రారంభం.. పోరాట స్ఫూర్తిని చాటే సంప్రదాయ క్రీడకు సన్నాహాలు యువత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి. ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం అన్నా మీ కోసమే అప్పుల పాలు అయ్యాం సెలవు రోజున స్పెషల్ క్లాసులా..? చిన్న శ్రీను ని మర్యాదపూర్వకంగా కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పొన్నూరుకు అభివృద్ధి జోరు రూ.32.10 కోట్ల పనులకు శ్రీకారం! గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో ప్రపంచానికి సీమ రైతు సత్తా !

గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ప్రజలకు అంకితభావంతో సేవలందించాలి

Select Suryaa Now
గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ప్రజలకు అంకితభావంతో సేవలందించాలి

 జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు   కలెక్టరేట్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :    మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.  శుక్రవారం కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్లు మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వేణుగోపాల్ తదితరులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, సత్యం, అహింస, శాంతి, సేవ వంటి గాంధీజీ ఆదర్శాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో పయనిస్తూ విధుల నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తూ, ప్రభుత్వ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా అందించేందుకు ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.