ప్రమాదవశాత్తు రేవులో పడి బాలుడు గల్లంతు
ఇరగవరం, మేజర్ న్యూస్ :ఇరగవరం మండలంలోని సిద్ధాంతం నత్తా రామేశ్వరం రోడ్లో కాకిలేరు గ్రామం వద్ద రాపాక -చిక్కాల కాలువలో పడి విద్యార్థి గల్లంతైనట్లు ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నసిరుల్లా చెప్పారు. ఐనపర్రు గ్రామానికి చెందిన కర్రి దామోదర్ రెడ్డి కుమారుడు కర్రి మోహన్ రెడ్డి(15)మరో ముగ్గురు విద్యార్థులు ఉదయం కాలకృత్యములు తీర్చుకోవడానికి వెళ్ళినట్లు చెప్పారు. వస్తూ మార్గమధ్యలో నర్సాపురం ప్రధాన కాలువ(గోంతేరు డ్రైన్)రాపాక -చిక్కాల కాలువ ముగ్గురమ్మల ఆలయం సమీపంలో కాళ్ళు కడుక్కోవడానికి రేవులోకి దిగగా ప్రమాదవాశాత్తు కాలువలోకి జారిపడిపోయినట్లు చెప్పారు.మిగిలిన విద్యార్థులు చుట్టుప్రక్కల పనిచేస్తున్నవారిని పిలిచినా ఎవరు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు.సమాచారం అందుకున్న ఇరగవరం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నసిరుల్లా సిబ్బందితో సంఘటన స్థలంకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు పోలీస్,ఫైర్, గజ ఈటగాళ్లు, డ్రోన్ కెమెరాలతో నిరంతరాయంగా గస్తీ నిర్వహించిన శుక్రవారం సాయంత్రం వరకు ఆచూకీ లభ్యం కాలేదని సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ నసిరుల్లా చెప్పారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
దొరబాబు ఇరగవరం