BREAKING
నల్లగొండ హజ్రత్ సయ్యద్ లతీఫ్ ఖాద్రీ ఉరుసు ఉత్సవాల్లో అన్నదానం వత్సవాయిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు మహాత్మా గాంధీకి ఆర్యవైశ్య సంఘం ఘన నివాళులు మండలంలో 69పాఠశాలల ఎన్నికలు పూర్తి లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు, ఆదర్శాలు యువతకు స్ఫూర్తిదాయకం.. ప్రజా సేవకు చిరునామా : మద్దినేని గాంధీ, శాస్త్రిలకు ఘన నివాళులు ,మహాత్ముడి గ్రామ స్వరాజ్య ఆశయాలను జగనన్న సాకారం చేశారు రైల్వే లైన్ నిర్మాణం నిధుల విడుదలను స్వాగతిస్తున్నాను.. మాజీ పార్లమెంట్ సభ్యులు డా. పి. రవీంద్ర బాబు.. పల్లె పండుగ తో గ్రామ అభివృద్ధికి కొత్త ఊపిరి తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు జిల్లా స్థాయి అవార్డు అందుకున్న కార్యదర్శి అమలాపురంలో దసరా సందడి, చెడీ తాలింఖానా శిక్షణ ప్రారంభం.. పోరాట స్ఫూర్తిని చాటే సంప్రదాయ క్రీడకు సన్నాహాలు యువత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి. ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ,గాంధీ విగ్రహానికి వినతిపత్రం  ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం,కోడ్ ది బ్రెయిన్, కంట్రోల్ ది మోషన్ పై అవగాహన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి..

బీసీలకు 34% రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేదే లేదు: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ * బీసీల సామాజిక న్యాయం, సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం * రిజర్వేషన్లు దక్కే వరకు న్యాయపోరాటం – సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కదిరి ఎమ్మెల్యే కందికుంట

Select Suryaa Now
బీసీలకు 34% రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేదే లేదు: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్   * బీసీల సామాజిక న్యాయం, సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం   * రిజర్వేషన్లు దక్కే వరకు న్యాయపోరాటం – సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కదిరి ఎమ్మెల్యే కందికుంట

 

కదిరి ;స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం విషయంలో ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.

కదిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు జీవోలు జారీ చేస్తే, వైసీపీ నేతలు కోర్టుకెళ్లి అడ్డుకోవడం దారుణమన్నారు. గత వైసీపీ పాలనలో న్యాయపరమైన రక్షణ కల్పించకపోవడం వల్లే దాదాపు 16,800 మంది బీసీ ప్రజాప్రతినిధులు తమ పదవులను కోల్పోయారని విమర్శించారు.

హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే, బీసీలకు న్యాయం జరిగేలా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. 1987లో 20 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను రాజకీయంగా ఆదుకున్న చరిత్ర టీడీపీదని గుర్తుచేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా పాలనలో భాగస్వాములను చేయడమే తమ ధ్యేయమని పునరుద్ఘాటించారు.

ఈ సమావేశంలో కదిరి నియోజకవర్గ పరిశీలకులు చెంచయ్య నాయుడు, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, టీడీపి నాయకులు ఖాసీం వలి, పిచ్చిలి శంకర తదితరులు పాల్గొన్నారు.