భవిష్యత్ మొత్తం సోలార్ మయమే
*సూర్యాపేట టౌన్ మేజర్ న్యూస్*
సూర్యాపేట: భవిష్యత్‌లో విద్యుత్ అవసరాలను తీర్చడంలో సోలార్ విద్యుత్ కీలక పాత్ర పోషించనుందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయ కాలనీ సమీపంలో మా సోలార్ షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సోలార్ విద్యుత్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నూతనంగా ప్రారంభించిన సోలార్ షాపు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జానయ్య, శ్రీను, నిర్వాహకులు భూతం వంశీ, రామసాని రవితేజ తదితరులు పాల్గొన్నారు.