BREAKING
పొర్లుకట్టలో పండుగలా పెన్షన్ల పంపిణీ అల్లు అర్జున్ రాకా సినిమాపై బిగ్ అప్‌డేట్.. సింగిల్ పార్టా లేక రెండు భాగాలుగా వస్తోందా రక్షణ రంగ ఆర్థిక నిర్వహణలో నూతన డిజిటల్ విప్లవం విపత్తుల వేళ యువత ముందుండాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు* సంగారెడ్డి జిల్లాలో విషాదం.. 25 ఎకరాలు తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు పాంచాలి నగర్ అంతా చెత్తాచెదారం. " మహిళా సాధికారత మాటలకే పరిమితమా… - కాకాణి పూజిత" అహోబిలంలో అటవీశాఖ అధికారుల విస్తృత తనిఖీలు అక్టోబర్ 3 నుంచి కౌటిల్య ఆర్థిక సదస్సు ఆసియా క్రీడల హాకీ సెమీఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై భారత్ సంచలన విజయం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశారు.. ది ప్యారడైజ్ మూవీపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు అనంతపురంలో అల్ట్రావయోలెట్ యూవీ స్పేస్ స్టేషన్ ప్రారంభం సెప్టెంబర్‌లో రూ.2.03 లక్షల కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు పోషకాహార లోపం నివారణలో అంగన్వాడీలు కీలకం సనాతన ధర్మంలో గురువుల ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది !

లింగాలలో ఇంటింటికీ టీడీ జనార్దన్ పర్యటన

Select Suryaa Now
లింగాలలో ఇంటింటికీ టీడీ జనార్దన్ పర్యటన

వత్సవాయి మేజర్ న్యూస్ :- కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లింగాల గ్రామంలో ఇంటింటికీ కార్యక్రమం నిర్వహించారు.రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు కుటుంబాలను ఆయన నేరుగా కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, వృద్ధులు, పేద కుటుంబాలకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించినట్లు తెలిపారు.అలాగే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలు తీరుపై ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని టీడీ జనార్దన్ తెలిపారు.ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధిపై ఆయన మాట్లాడుతూ.. అమరావతిని ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.6 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు ఉందని తెలిపారు. తొలి త్రైమాసికానికి రూ.2,100 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయని చెప్పారు.అమరావతి హైకోర్టు భవనం ఎంఈపీ పనులకు రూ.556 కోట్ల పరిపాలనా అనుమతులు, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.165.33 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ అయిన విషయాన్ని కూడా ప్రజలకు వివరించారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటామని టీడీ జనార్దన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.