రొడ్డు మరమ్మత్తు పనులు పరిశీలించిన కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ రోడ్లపై గుంతలకు అత్యంత వేగంగా మరమ్మతు చేసే ప్రత్యేకమైన పాత్ హోల్ బస్టర్స్ వాహన పనితీరును గురువారం పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడి సిబ్బంది వాహనాల రాకపోకలకు అసౌకర్యంగా ఉండటంతో ప్రత్యేకంగా విజయవాడ నగరపాలక సంస్థ నుంచి తీసుకొచ్చిన పాత్ హోల్ బస్టర్ వాహనం ద్వారా రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వాహనం పనితీరును పరిశీలించి నగరపాలక సంస్థ పరిధిలో అవసరమైన ప్రాంతాల్లో వాహనం ద్వారా రోడ్ల మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి అయ్యేలా పర్యవేక్షిస్తామని తెలిపారు.