జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
మిర్యాలగూడ, మేజర్ న్యూస్: జర్నలిస్టులసమస్యలసాధనకోసంటీయూడబ్ల్యూజే - ఐజేయూ పిలుపు మేరకు మిర్యాలగూడ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలిమెల నాగయ్య, టీయూడబ్ల్యూజే జిల్లా ప్రచార కార్యదర్శి అస్లాం, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు జూపల్లి బాలాజి రావు తెలిపారు.ఈ ధర్నాలో మిర్యాలగూడ డివిజన్ లోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.దేశవ్యాప్తంగా జర్నలిస్టులుఎదుర్కొంటున్నసమస్యలపైఇటీవలకర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా జర్నలిస్ట్ యూనియన్ జాతీయకార్యవర్గసమావేశంలో దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించడం జరిగిందనితెలిపారు.మీడియా కమిషన్ ఏర్పాటు చేసి
తెలుగు జర్నలిస్టులకు పని భద్రత, ఆర్థిక భద్రత కల్పించి,భౌతిక దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు 1958లో వేతన సవరణ చేయగా, నేటి వరకు ఎలాంటి సవరణలు జరగలేదు. నిత్యావసర ధరల్లో మార్పులు, ఇంధన రవాణా చార్జీల పెంపు, స్కూలు, హాస్పిటల్ ఖర్చులు పెరిగినందున న్యూ వేజ్ బోర్డు ఏర్పాటు చేసి వేతన సవరణలు చేపట్టాలన్నారు.అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు,క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కోసం హెల్త్ కార్డుల మంజూరు,అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు రైల్వే పాస్ లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ
ఐజేయూ పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యం లోజరిగేఈధర్నాకార్యక్రమం లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.