BREAKING
ప్రతి ఇంటికి సోలార్ ను ఏర్పాటు చేసుకోండి : విద్యుత్ శాఖ డిఈటి రాజు నాయక్ గాంధీజీ ఆశయాల స్ఫూర్తితో ప్రజలకు అంకితభావంతో సేవలందించాలి రాజ్యాంగ విలువలే గాంధీజీ ఆశయాలకు నిదర్శనం "స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి - కాకాణి" బీసీలకు 34% రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేదే లేదు: ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ * బీసీల సామాజిక న్యాయం, సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం * రిజర్వేషన్లు దక్కే వరకు న్యాయపోరాటం – సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రమాదవశాత్తు రేవులో పడి బాలుడు గల్లంతు ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి : జిల్లా కలెక్టర్ ప్రియాంక బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం.. 34 శాతం సాధించి తీరుతాం: టీడీపీ నాయకులు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి ఏపీ ఎన్జీవో జిల్లా కార్యదర్శిగా వి. సురేష్ బాబు భక్తిశ్రద్ధలతో రాజరాజేశ్వరి అమ్మవారికి రాహుకాల పూజలు ఎంపీఎస్సీ కార్యదర్శి మహేంద్ర హర్పాల్కర్ డిప్యుటేషన్ రద్దు, అభ్యర్థుల ఆందోళనకు తలొగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు.. నెల్లూరు టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం శ్రీధర్ ప్రజలకు సేవలందిస్తున్న ఆశా, అంగన్‌వాడీ, ఆర్‌పీలు, మహిళా సంఘాల ప్రతినిధుల సేవలు అభినందనీయం : ఎంపీ డీకే అరుణ, జిల్లా కలెక్టర్ ప్రియాంక. పెంచలకోన స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి

బీసీల హక్కులకు భంగం కలిగిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

Select Suryaa Now
బీసీల హక్కులకు భంగం కలిగిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపణలు

ప్రొద్దుటూరు, అక్టోబర్ 1, మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. బీసీ కులాలకు, ఆయా వర్గాల ప్రజలకు రావాల్సిన హక్కులు, సామాజిక గౌరవానికి ప్రస్తుత ఎమ్మెల్యే తీరుతో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
బీసీ వర్గాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో తమ హక్కుల కోసం పోరాడుతున్నారని రాచమల్లు పేర్కొన్నారు. అయితే అధికార అండను ఉపయోగించుకుంటూ బీసీలకు దక్కాల్సిన హక్కులను, అవకాశాలను దూరం చేసే విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీసీ కులస్థుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
బీసీలకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కులు, అవకాశాలు, సంక్షేమ ఫలాలు సమానంగా అందేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏ వర్గానికీ అన్యాయం జరగకుండా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని సూచించారు. బీసీ వర్గాల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల తరఫున ప్రశ్నించేందుకు తాము ముందుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా బీసీ కులాలకు చెందిన నాయకులు, ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉండాలని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు బీసీ వర్గాల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు