BREAKING
భవిష్యత్ మొత్తం సోలార్ మయమే వృద్ధులకు అండగా న్యాయ సేవాధికార సంస్థ :కనిగిరి జడ్జి బి. రూపశ్రీ వైద్య శిబిరానికి మంచి స్పందన అలియా భట్, కార్లోస్ సైంజ్ క్రేజీ కొలాబరేషన్.. లొరియల్ Paris అడ్వర్టైజ్‌మెంట్‌తో సోషల్ మీడియాలో రికార్డులు గాంధీజీ ఆశయాలను ఆచరించాలి ఎన్నికల సంఘాన్ని రద్దు చేసి కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలి* ఎం.ఎం.హళ్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్ నటి రన్యారావుకు బిగ్ షాక్.. బంగారం స్మగ్లింగ్ కేసులో రూ.89 కోట్ల భారీ జరిమానా బొటానిక్స్ పరిశ్రమను ప్రారంభించిన ఎం.ఎస్.ఎం.ఇ రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాసరావు స్వచ్ఛ తిరుపతి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి ఎమ్మెల్యే ఆరణి -ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలి : కమిషనర్ జయకృష్ణ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మహిళలు రక్తహీనతకు గురి కాకుండా జాగ్రత్త వహించాలి-రెడ్ క్రాస్ ట్రెజరర్ డాక్టర్ అరుణకుమారి నేతన్నలను సీఎం ఆదుకోరా? లింగాలలో ఇంటింటికీ టీడీ జనార్దన్ పర్యటన జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

వైసీపీ మాజీ మంత్రులకు ఆహ్వానం

Select Suryaa Now
వైసీపీ మాజీ మంత్రులకు ఆహ్వానం

పులివెందులలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి వైసీపీ మాజీ మంత్రులు హాజరుకావాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్ పిలుపునిచ్చారు. గురువారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ మాజీ మంత్రులకు ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించి ఆహ్వానించారు. పులివెందులలో 450 కోట్లతో ప్రభుత్వం డ్యాంను నిర్మించిందని, ఆ ప్రారంభోత్సవానికి వైసీపీ నాయకులందరికీ ఆహ్వానమని చెప్పారు. వైసిపి"అసెంబ్లీకి ఎలాగో రావడం లేదు, కనీసం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకైనా రండి" అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ద్విచక్ర వాహనం కూడా పోలేని చోట కార్లు, బస్సులు నడిచేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్లు అభివృద్ధి చేశారని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గం ఎవరిదైనా ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని, పులివెందులలో అభివృద్ధిని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గాలికొదిలేశారని విమర్శించారు. జగన్ లాగా రాజకీయ కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం లేదన్నారు. ఈ సమావేశంలో తాతయ్యగుంట పాలకమండలి సభ్యుడు రుద్ర కిషోర్, జనసేన 44 వార్డు అధ్యక్షుడు సాయి దేవ్, 16వ వార్డు అధ్యక్షుడు మనోజ్ పాల్గొన్నారు.