ఆసరా కోల్పోయిన మహిళలకు ప్రభుత్వం అండ
ఆసరా కోల్పోయిన మహిళలకు ప్రభుత్వం అండ..!
- టిడిపి రాష్ట్ర నాయకులు మువ్వా శ్రీనివాస్
- ఐ టిడిపి మండల అధ్యక్షులు బాచినేని శ్రీకాంత్
- ఎటపాక మాజీ సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు
- బొజ్జిగుప్పలో నూతన స్పౌజ్ పింఛన్ల పంపిణీ
ఎటపాక మేజర్ న్యూస్
భర్త మరణంతో ఆసరా కోల్పోయిన మహిళలకు కూటమి ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ అందజేసి ఆర్థిక భరోసా కల్పిస్తోందని టిడిపి రాష్ట్ర నాయకులు మువ్వా శ్రీనివాస్ , ఐ టిడిపి మండల అధ్యక్షులు బాచినేని శ్రీకాంత్ , ఎటపాక మాజీ సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు అన్నారు. ఎటపాక మండల పరిధిలోని బొజ్జిగుప్ప గ్రామంలో నూతన స్పౌజ్ పింఛన్లను వారి చేతుల మీదుగా గురువారం నాడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మువ్వ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి భాస్కర్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా ఎటపాక పంచాయతీ బొజ్జిగుప్ప గ్రామంలో నూతన స్పౌజ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేలు అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను , ప్రతి హామీని నెరవేర్చటంలో చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. దేశంలో వృద్ధులకు , వితంతువులకు రూ.4 వేలు పెన్షన్ , వికలాంగులకు రూ.6 వేలు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తలసేమియా బాధితులు , కిడ్నీ బాధితులకు రూ.10 వేలు అందజేసి భరోసా ఇస్తూ చరిత్రలో మిగిలిపోయే విధంగా పాలన అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుగోజు మురళి , సచివాలయ సిబ్బంది , పింఛన్ దారులు , తదితరులు పాల్గొన్నారు.