41 ఏళ్ల పోలీస్ సేవలకు ఎస్‌ఐ కె. గోపాల్ వీడ్కోలు
అంకితభావంతో సేవలందించారు.. పదవీ విరమణ అనంతరం సుఖసంతోషాలతో ఉండాలి : ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 1):
వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా 41 ఏళ్లపాటు అంకితభావంతో సేవలందించిన కె. గోపాల్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్‌లు కె. గోపాల్‌ను శాలువాతో సన్మానించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీస్నేహమరో మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో 41 ఏళ్లపాటు నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వహించిన కె. గోపాల్ సేవలను అభినందించారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.అదనపు ఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు కె. గోపాల్ అందించిన సుదీర్ఘ సేవలను అభినందించారు. పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం ఆరోగ్యంగా, సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రమేష్ కుమార్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, కె. గోపాల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహచర అధికారులు, సిబ్బంది ఆయనతో తమకున్న అనుబంధాన్ని, పోలీస్ శాఖకు అందించిన సేవలను గుర్తుచేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.