డా బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27 వ స్నాతకోత్సవం
ప్రముఖ చిత్ర నిర్మాత, రచయిత, నటుడు శ్రీ బి. నరసింగరావు గారికి గౌరవ డాక్టరేట్*
తెలంగాణ గౌరవ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా గారు ముఖ్య అతిథి
• న్యాక్ మాజీ డైరెక్టర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ గారు స్నాతకోత్సవ అతిథి
• మీడియా ప్రతినిధుల సమావేశంలో వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2026: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం బుధవారం, అక్టోబర్ 7, 2026న ఉదయం 10:30 గంటలకు భవనం వెంకట్రామ్ ఆడిటోరియం, యూనివర్సిటీ క్యాంపస్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌లో జరగనుందని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ - ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి బుధవారం టూరిజం ప్లాజా లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. ఈ స్నాతకోత్సవానికి తెలంగాణ గౌరవ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా గారు ముఖ్య అతిథిగా హాజరై ఎం.ఫిల్, పీహెచ్.డీ పట్టాలు, యుజి/పిజి డిగ్రీలు, బంగారు పతకాలు మరియు బుక్ ప్రైజ్‌లను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. న్యాక్ మాజీ డైరెక్టర్, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ గారు స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ స్నాతకోత్సవంలో ప్రముఖ చిత్ర నిర్మాత, రచయిత, నటులు శ్రీ బి. నరసింగరావు గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. వైస్ - ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి గారి అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవంలో మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ/పీజీ/డిప్లొమా/సర్టిఫికెట్లు కోర్సుల్లో పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
పత్రికా సమావేశ ముఖ్యాంశాలు:
- మొత్తం 36,145 మంది అభ్యర్థులు డిగ్రీలు/డిప్లొమాలు/సర్టిఫికెట్లు అందుకోనున్నారు.
- అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో 17,960 మంది.
- పి.జి/డిప్లొమా/సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌లో 18,185 మంది.
- 19,800 మంది మహిళా విద్యార్థులు డిగ్రీలు అందుకుంటున్నారు.
- 16,334 మంది పురుష విద్యార్థులు డిగ్రీలు అందుకుంటున్నారు.
- 43 మంది (యుజి-4, పిజి-39) ఆర్మీ సిబ్బంది పట్టభద్రులవుతున్నారు (పురుషులు-37, మహిళలు-6).
- 11 మంది ట్రాన్స్‌జెండర్లు తమ డిగ్రీలను అందుకుంటున్నారు.
- ఎం.ఫిల్, పిహెచ్.డి డిగ్రీలు: 23 మంది పరిశోధక విద్యార్థులకు పిహెచ్.డి, ఒకరికి ఎం.ఫిల్ డిగ్రీ ప్రదానం చేయనున్నారు.
- 38 బంగారు పతకాలు (యుజిలో 16, పిజిలో 22). మొత్తం 38 పతకాల్లో మహిళలు 29, పురుషులు 09.
- యుజిలో మహిళలు 14, పురుషులు 02 బంగారు పతకాలు సాధించారు.
- పిజిలో మహిళలు 15, పురుషులు 07 బంగారు పతకాలు సాధించారు.
- రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందిన ఒక ఖైదీ ఒకే ప్రయత్నంలో అన్ని సబ్జెక్టులలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడై బంగారు పతకం మరియు బుక్ ప్రైజ్ సాధించడం విశేషం.
- గత 45 ఏళ్లలో డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సుమారు 6,27,175 డిగ్రీలు ప్రదానం చేసినాము.
- 27 మంది ఖైదీలకు డిగ్రీలు: ఈ ఏడాది స్నాతకోత్సవ ప్రత్యేకత ఏమిటంటే 26 మంది పురుష ఖైదీలు, ఒక మహిళా ఖైదీతో సహా మొత్తం 27 మంది (చెర్లపల్లి సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైలు నుండి) డిగ్రీలు అందుకుంటున్నారు. అందులో యుజి 12, పిజి 15 మంది ఉన్నారు.
ఒకటి కంటే ఎక్కువ బంగారు పతకాలు పొందినవారు - యుజి ప్రోగ్రామ్స్:
- బొజ్జనపల్లి శ్రీ ఆశ్రిత (అడ్మిషన్ నెం. 1932250921) మూడు బంగారు పతకాలు సాధించారు.
- కడియాల సాయిభాను (అడ్మిషన్ నెం. 0562210452) రెండు బంగారు పతకాలు సాధించారు.
- హజీరా బేగం (అడ్మిషన్ నెం. 1942233723) రెండు బంగారు పతకాలు సాధించారు.
- శివ పార్వతి చిప్పల (అడ్మిషన్ నెం. 1262248043) రెండు బంగారు పతకాలు సాధించారు.
- నుకపెయ్యి సురేష్ (అడ్మిషన్ నెం. 0742243912) - ఖైదీ - యుజిలో ఒక బంగారు పతకం మరియు బుక్ ప్రైజ్ కూడా సాధించారు.
ఒకటి కంటే ఎక్కువ బంగారు పతకాలు పొందినవారు - పి.జి. ప్రోగ్రామ్స్:
- మంతెన శ్రీదేవి (అడ్మిషన్ నెం. 02124071205) రెండు బంగారు పతకాలు సాధించారు.
- తోట శ్వేత (అడ్మిషన్ నెం. 02123283608) రెండు బంగారు పతకాలు సాధించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు:
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆమోదంతో 2026-27 విద్యా సంవత్సరం నుండి ODL విధానంలో 8 కొత్త ప్రోగ్రామ్స్, ఆన్‌లైన్ విధానంలో 5 కొత్త ప్రోగ్రామ్స్ ప్రవేశపెడుతున్నామని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ - ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.
ODL విధానంలో అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సులు (2026-27 నుండి):
- మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA)
- ఎం.ఎస్సీ కంప్యూటర్ సైన్స్
- ఎం.ఎస్సీ డేటా సైన్స్
- ఎం.ఎస్సీ స్టాటిస్టిక్స్
- ఎం.ఎస్సీ జాగ్రఫీ
- మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW)
- ఎం.ఏ ఎడ్యుకేషన్
- ఎం.ఏ ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్)
కొత్తగా అనుమతి పొందిన ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ (2026-27 నుండి):
డిజిటల్ విద్య వైపు అడుగులు వేస్తూ ఆన్‌లైన్ విధానంలో ఈ క్రింది ప్రోగ్రామ్స్ ప్రవేశపెడుతున్నామని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు.
- ఎం.ఏ తెలుగు
- మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎం.కామ్)
- మాస్టర్ ఆఫ్ బిజినెస్. అడ్మినిస్ట్రేషన్ (MBA) జనరల్
- బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బి.కామ్) - ఇంగ్లీష్ మీడియం- బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ - తెలుగు మీడియం
నైపుణ్యం, ఉపాధి కల్పన వైపు కొత్త అడుగులు:
విద్యార్థులకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు విశ్వవిద్యాలయం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MOU) కుదుర్చుకుంది.
AI ఆధారిత, డిజిటల్ విద్యలో జాతీయ స్థాయిలో ముందంజలో నిలిచిన డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) తో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
COL సహకారంతో గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా COL-CEMCAతో గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ఒప్పందం కుదుర్చుకుని, ఇప్పటికే ఉన్న కోర్సుల్లో ఉపాధి అంశాలను చేర్చడం మరియు ప్రత్యేక నైపుణ్య కోర్సును అభివృద్ధి చేయడం జరుగుతోంది. డిసెంబర్ 16-18, 2025 తేదీల్లో మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించాము- TCS iON సహకారంతో "జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్" ప్రోగ్రామ్ - మొదటి సెమిస్టర్ నుండే విద్యార్థులను కార్పొరేట్ అవసరాలకు సిద్ధం చేస్తున్నాము.
కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) తో MOU - విద్యార్థులకు ఉన్నత విద్య, డిజిటల్ సేవలను సులభంగా అందుబాటులోకి తేవడానికి 12,000 CSC కేంద్రాల ద్వారా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సేవలు అందిస్తున్నాము.
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థతో వృత్తి నైపుణ్యాల పెంపునకు MOU.
దేశ సేవలో నిరంతరం నిమగ్నమై ఉన్న సైనిక సిబ్బందితో పాటు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కూడా యూనివర్సిటీ ఇప్పటికే ఉచిత విద్యను అందిస్తోంది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తో MOU- సమతా సపోర్ట్ స్కీమ్: విశ్వవిద్యాలయం సమాన అవకాశాల ప్రణాళికలో భాగంగా ఆదివాసీ యువత, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఉచిత విద్యను అందించనుంది. గోండ్, కోయ, చెంచు తదితర వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్యను అందిస్తోంది.
గోండు, కోయ, చెంచు వంటి ప్రత్యేకంగా వెనుకబడిన తెగలకు ఉచిత ఉన్నత విద్య అందించడానికి ఆర్ధిక సహకారం అందించేలా జ్యోతి రెడ్డి ఫౌండేషన్‌తో MOU.విదేశీ భాషలలో (ఇంగ్లీష్, జర్మన్, కొరియన్, ఫ్రెంచ్) శిక్షణ కోసం IGNITUS Edu tech సహకారంతో లాంగ్వేజ్ లెర్నర్ సెంటర్ ఏర్పాటు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ. ఏ. రేవంత్ రెడ్డి గారితో ప్రారంభించేలా ప్రణాళిక చేస్తున్నాం. క్యాంపస్‌లో 24/7 నిరంతర విద్యుత్ సరఫరా కోసం TGPDCL తో MOU- ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు "AI ఫర్ టీచర్స్" కార్యక్రమాన్ని పాఠశాల విద్యా శాఖతో కలిసి BRAOU డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా నిర్వహణ.
కొత్త మౌలిక సదుపాయాల కల్పన :
యూనివర్సిటీ తీసుకునే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని, మౌళిక వసతుల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. ఏ. రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సహకారానికి వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. అందులో
పాలన, సమానత్వంపై ప్రత్యేకమైన చర్చకు యూనివర్సిటీ వేదిక కావాలనే ఆలోచనలతో బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డైలాగ్ ఆన్ గవర్నెన్స్ అండ్ ఈక్విటీ (BRiiDGE) ను ప్రారంభించాము. సమాజాన్ని విభజించే అదృశ్య గోడలను తొలగించడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం SC సబ్-ప్లాన్ నుండి రూ. 100 కోట్లు కేటాయించింది. BRiiDGE కార్యక్రమాన్ని కొనసాగించడానికి వచ్చే ఐదేళ్ల పాటు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని వైస్-ఛాన్సలర్ వెల్లడిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.- రూ. 10.00 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర అభ్యాస కేంద్రం (Comprehensive Learner Centre) కొత్త భవన నిర్మాణం ప్రక్రియలో ఉంది.రూ. 7.00 కోట్ల వ్యయంతో కొత్త ప్రహరీ గోడ మరియు అంతర్గత రహదారుల పనులు ప్రక్రియలో ఉన్నాయి- రూ. 12.00 కోట్ల వ్యయంతో సెంట్రలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ (LAB) మరియు డిజిటల్ రిసోర్స్ సెంటర్ (DRC) కొత్త భవనం పనులు ప్రక్రియలో ఉన్నాయి- రూ. 2.00 కోట్ల వ్యయంతో సిబ్బంది క్వార్టర్స్ కొత్త భవన నిర్మాణం జరుగుతోంది.HMDA ద్వారా పరిపాలనా భవనం పక్కన కాక్టస్ గార్డెన్ అభివృద్ధి, క్యాంపస్‌లో జ్ఞాన వనంలో బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాము.విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఆట స్థలం అభివృద్ధి చేస్తున్నాము. డిజిటల్ క్లాస్ రూమ్ AI DEA ల్యాబ్ అభివృద్ధి.విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని CSTD భవనంలో డిజిటల్ క్లాస్ రూమ్ RVR చంద్రశేఖర రావు మీటింగ్ హాల్ ను అభివృద్ధి చేశాము.