BREAKING
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు - పార్కింగ్‌ ప్రాంతాలపై కలెక్టర్‌, ఎస్పీ పరిశీలన

Select Suryaa Now
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు - పార్కింగ్‌ ప్రాంతాలపై కలెక్టర్‌, ఎస్పీ పరిశీలన

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్‌ 5న ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు భద్రతా, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రొద్దుటూరు–జమ్మలమడుగు బైపాస్‌ రోడ్డులోని మున్సిపల్‌ ప్లాట్లను జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పరిశీలించారు. సీఎం పర్యటనకు వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం మున్సిపల్‌ ప్లాట్లను వినియోగించే అంశాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కింగ్‌ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. పార్కింగ్‌ ప్రాంతం నుంచి ప్రధాన కార్యక్రమ వేదిక వరకు వాహనాలు, ప్రజల రాకపోకలపై కూడా సమీక్షించారు. కలెక్టర్‌, ఎస్పీతో కలిసి జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీనా కూడా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బందోబస్తు విషయంలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని, పర్యటన సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌, ఎస్పీ స్పష్టం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు, అదనపు ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.