పోలంపల్లిలో కొత్తగా మంజూరైన స్పౌజ్ పింఛన్ అందజేత
వత్సవాయి మేజర్ న్యూస్ :- కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇటీవల బలవంతపు ఆదాము మృతి చెందడంతో ఆవేదనలో ఉన్న ఆయన భార్య బలవంతపు వెంకటరత్నంకు నూతనంగా మంజూరైన స్పౌజ్ పింఛన్‌ను గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందుతున్న సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా కొంతమేర అండగా నిలుస్తున్నామని నాయకులు తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), సొసైటీ అధ్యక్షుడు మన్నే బాలకృష్ణ అందించిన సహకారం, దిశానిర్దేశంతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు మన్నే భాస్కరరావు, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు దారేల్లి చిరంజీవి, నాయకులు వంకాయలపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.