BREAKING
ఒడిశాలో దారుణం: చేతబడి నెపంతో 54 ఏళ్ల మహిళపై కర్కశ దాడి జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్‌ 2న నిరసన నాగార్జున గీతాంజలి మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి థియేటర్లలోకి మణిరత్నం క్లాసిక్ మాస్టర్‌పీస్ పరిశుభ్ర నగర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకం ప్రకృతి వ్యవసాయ లక్ష్యాల సాధనకు సమిష్టిగా పని చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంపికలో సామాజిక న్యాయం ఎక్కడ? మహిళా భద్రతపై అవగాహన బిగ్‌బాస్ హౌస్‌లో ముసలం.. డ్యాగర్ల టాస్క్‌లో తారాస్థాయికి చేరిన గొడవలు 41 ఏళ్ల పోలీస్ సేవలకు ఎస్‌ఐ కె. గోపాల్ వీడ్కోలు బీసీల రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : సీఎం చంద్రబాబు అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నంద్యాల విద్యార్థి హర్షవర్ధన్ కేబీసీ షూటింగ్‌లో ప్రమాదం.. జారిపడ్డ అమితాబ్ బచ్చన్ మోకాలికి గాయం రిజల్యూషన్ ఎసోపగీల్ మానోమెట్రీ అను పరికరమును ప్రారంభించిన మంత్రి టీ.జి భరత్, గాంధీ జయంతి ఆంక్షలు అమలయ్యేనా..?

అనకాపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా ఈ. సందీప్ బాధ్యతల స్వీకరణ

Select Suryaa Now
అనకాపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా ఈ. సందీప్ బాధ్యతల స్వీకరణ

  అనకాపల్లి ప్రతినిధి, అక్టోబర్ 1, మేజర్ న్యూస్: 
అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పిపి) డిప్యూటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా
ఈ. సందీప్ గురువారం  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ విషయాన్ని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డిప్యూటీ సీఈఓ ఈ. సందీప్ కార్యాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రతి ఉద్యోగి సమన్వయంతో, బాధ్యతాయుతంగా, సమయపాలనతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సక్రమంగా చేరేలా పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. సిబ్బంది సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం పరిపాలనాధికారులు పి.వి.వి.ఎన్. మూర్తి, రాజేశ్వరి , అమ్మాజి తదితరులు నూతన డిప్యూటీ సీఈఓ సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.