BREAKING
ఒడిశాలో దారుణం: చేతబడి నెపంతో 54 ఏళ్ల మహిళపై కర్కశ దాడి జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్‌ 2న నిరసన నాగార్జున గీతాంజలి మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి థియేటర్లలోకి మణిరత్నం క్లాసిక్ మాస్టర్‌పీస్ పరిశుభ్ర నగర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకం ప్రకృతి వ్యవసాయ లక్ష్యాల సాధనకు సమిష్టిగా పని చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంపికలో సామాజిక న్యాయం ఎక్కడ? మహిళా భద్రతపై అవగాహన బిగ్‌బాస్ హౌస్‌లో ముసలం.. డ్యాగర్ల టాస్క్‌లో తారాస్థాయికి చేరిన గొడవలు 41 ఏళ్ల పోలీస్ సేవలకు ఎస్‌ఐ కె. గోపాల్ వీడ్కోలు బీసీల రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : సీఎం చంద్రబాబు అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నంద్యాల విద్యార్థి హర్షవర్ధన్ కేబీసీ షూటింగ్‌లో ప్రమాదం.. జారిపడ్డ అమితాబ్ బచ్చన్ మోకాలికి గాయం రిజల్యూషన్ ఎసోపగీల్ మానోమెట్రీ అను పరికరమును ప్రారంభించిన మంత్రి టీ.జి భరత్, గాంధీ జయంతి ఆంక్షలు అమలయ్యేనా..?

ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

Select Suryaa Now
ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ప్రొద్దుటూరు, అక్టోబర్ 1, మేజర్ న్యూస్ : శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పట్టణంలోని 28వ సచివాలయం పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురువారం లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. చర్చి వీధి, శాంతకుమారి వీధి, మట్టి మసీదు వీధుల్లోని పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను పరిశీలించి, వారికి అందాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకం సామాజిక భద్రతకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నూరి పేర్కొన్నారు. లబ్ధిదారులు పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా సేవలందిస్తున్నదని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని నూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ నూర్ మహమ్మద్ (నూరి), వార్డు టీడీపీ నాయకుడు హర్ష, 28వ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు తమ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు