BREAKING
చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ గాంధీ మార్గంలో నడవాలి నర్సరీ రైతులకు తక్కువ ధరకే ఎర్రమట్టి :సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఈనెల 29న థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు' రీరిలీజ్.. నవ్వుల రచ్చ చేయడానికి రెడీ అయిన క్లాసిక్ కామెడీ మూవీ! వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు సమంతకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అనుమతి లేకుండా ఫొటోలు, గొంతు వాడితే ఇక అంతే! జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

ద్రవ్యోల్బణ భారం ప్రజలపై పడకుండా కట్టుదిట్టమైన చర్యలు:సీఎం చంద్రబాబు ఆదేశం

Select Suryaa Now
ద్రవ్యోల్బణ భారం ప్రజలపై పడకుండా కట్టుదిట్టమైన చర్యలు:సీఎం చంద్రబాబు ఆదేశం

సూర్య అమరావతి బ్యూరో: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భారం సామాన్య ప్రజలపై పడకుండా అన్ని స్థాయిల్లోనూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో నిత్యావసరాల ధరలను నిరంతరం పర్యవేక్షించాలని, సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

రైతుబజార్లలో సబ్సిడీ ధరకే ఉల్లి సరఫరా :మార్కెట్ జోక్యం :బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు పెరగకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, వినియోగదారులకు ఊరట కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన ఉల్లిపాయలను అందుబాటులోకి తెచ్చే చర్యలు ఇప్పటికే చేపట్టామని సీఎం తెలిపారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు:పౌర సరఫరాలు, విక్రయాల విభాగం నిరంతరం హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లను తనిఖీ చేయాలని, నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచినా లేక కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయించినా బ్లాక్ మార్కెటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా సమష్టి బాధ్యతసమన్వయంతోనే సమర్థవంతమైన పాలన:ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన అపారమైన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

క్షేత్రస్థాయి సమస్యలపై నిరంతర దృష్టి:పాలనా యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టనష్టాలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రతి విభాగం పనిచేయాలని సీఎం తేల్చిచెప్పారు.