ద్వారపూడిలో దసరా ఉత్సవాలకు శ్రీకారం
మండపేట మేజర్ న్యూస్ ;
ద్వారపూడి వేములపల్లి బంగారమ్మ కాలనీలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద విజయదశమి శరన్నవరాత్రి మహోత్సవాలకు గురువారం శ్రీకారం చుట్టారు. ఉత్సవ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో పందిరిరాట ముహూర్తాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరపు వీరబాబు,వీరవేణి దంపతులు అమ్మవారికి సమర్పించేందుకు పానకం, చలిమిడి, అరటిపండ్లు, పూజా సామగ్రి తదితర పదార్థాలను కావడిలో మోసుకుంటూ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో గోకాడ ప్రకాశం, కంకటాల మురళీకృష్ణ, మర్రెడ్డి వీరబాబు, ధనబాబు, సురేష్, గొంపాని కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు