పింఛన్ దారులకు ఇచ్చిన హామీ తప్పిన జగన్మోహన్ రెడ్డి - మంత్రి ఫరూక్
నంద్యాల అర్బన్: నంద్యాల మండలం పోలూరు గ్రామంలో మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారిలు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో లబ్ధిదారుకు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపించిందని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ వేయి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారికే దక్కిందని అన్నారు. అదేవిధంగా 1000/- రూపాయలు ఉన్న పెన్షన్ 2000/- చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గత ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ ని 3000 పెంచుతూ ఐదు సంవత్సరాలు గడిపిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ... ఏట 250/-రు పెంచుతూ ప్రజలను నమ్మకద్రోహం చేశారని, టిడిపి అధికారం చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 3000/- రు పెన్షన్ ని 4000 పెంచుతూ అదేవిధంగా మూడు నెలల ముందే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలా ప్రతినెల 1వ తేదీనే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని అలాగే ఒకటవ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీనే వారికి పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్టోబర్ 1 వ తేదీన నంద్యాల మండలం పోలూరు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే నంద్యాలలో అన్ని వార్డులలో , అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం పింఛన్ లబ్ధిదారులకు అల్పాహార విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలూరు గ్రామ టిడిపి నాయకులు పైరెడ్డి జోజీ రెడ్డి, జయ చంద్రారెడ్డి , కిరణ్ కుమార్ రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల మండలం టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, అర్ఫాత్ బాషా, అబ్దుల్లా, రామిరెడ్డి , హుస్సేన్ బాషా, అలీ అక్బర్ , ఖాదర్ బాషా, రాజా రెడ్డి , అర్షద్ బాషా, భూపాల్ రెడ్డి, అరుణ, సునీత మరియు తహసిల్దార్ శ్రీవాణి, ఎంపీడీవో సుగుణ శ్రీ , అధికారులు , సచివాలయ సిబ్బంది , టిడిపి నాయకులకు , కార్యకర్తలకు , అభిమానులకు , ప్రజలలు తదితరులు పాల్గొన్నారు