లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అఖిల
ఆళ్లగడ్డ లో అభివృద్ధి జోరు.. ప్రజల ఇంటి వద్దకే సంక్షేమం
*లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ పట్టణంలోని ఏసునాథపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గురువారంఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియఅందజేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఒకటో తేదీ వచ్చిందంటే ప్రభుత్వ అధికారులే ప్రజల ఇంటి వద్దకు వచ్చి పింఛన్ అందించే నమ్మకాన్ని కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమని తెలిపారు.పింఛన్ల పంపిణీ జరిగే ప్రాంతాల్లో గ్రామసభ తరహాలో సమావేశాలు నిర్వహించి,ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు.ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు.. అధికారులు, ప్రజల సమక్షంలో స్థానిక సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే వివరించారు.నియోజకవర్గంలో కొత్తగా సుమారు 6 వేలకుపైగా పింఛన్ల కోసం దరఖాస్తులు వచ్చాయని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ సమస్యకు పరిష్కారం చూపుతూ ఆళ్లగడ్డ పట్టణంలో 376 కొత్త ఇళ్లు మంజూరు చేయించామని చెప్పారు.అలాగే రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు, లైటింగ్, పార్కులు, మున్సిపల్ భవన అభివృద్ధి కోసం 21 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని.. ఈ నిధులతో ఆళ్లగడ్డ పట్టణ రూపురేఖలను మార్చేలా అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.పడకండ్ల ప్రాంతంలో చాలాకాలంగా పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కొత్త డ్రైనేజీ నిర్మాణం చేపట్టామని చెప్పారు. కాశీంద్రక్షేత్రంలో అయ్యప్ప స్వాములు నిర్మిస్తున్న ఆలయానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.టిడ్కో ఇళ్ల విషయంలోనూ ఎమ్మెల్యే అఖిలప్రియ స్పందించారు.గతంలో అధికారంలో ఉన్న సమయంలో టిడ్కో సమస్యలను పట్టించుకోని వారు ఇప్పుడు రాజకీయాల కోసం అక్కడ పర్యటించడం సరికాదని వైసీపీ నాయకుడు గంగుల నానిపై విమర్శలు చేశారు.తాము ఇప్పటికే టిడ్కోలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నామని.. టిడ్కో ఎండీతో కలిసి సుమారు 70 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించామని ఎమ్మెల్యే తెలిపారు.తాము రాజకీయాల కోసం కాదని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.గతంలో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలపై మాట్లాడిన విధానాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో బలంగా పోటీ చేస్తుందని తెలిపారు.ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.