BREAKING
రిలయన్స్ అధినేత అనంత్ అంబానీకి ఘన స్వాగతం కేవలం ఉత్సవాలకే పరిమితం కాదు.. ప్రజాస్వామ్యానికి గాంధీ ఆలోచనలు నేడు అత్యంత ఆవశ్యకం: రాజ్ థాకరే కీలక వ్యాఖ్యలు మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జనసేన నేత గురాన అయ్యలు గాంధీజీ చూపిన మార్గాలు కొణిదల పవన్, నారా లోకేష్ కు ఘన స్వాగతం పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోడీ ఫోన్: ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ, ధైర్యసాహసాలకు ప్రశంసలు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు మూసాపేటలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి: కొత్తగా పెళ్లైన యువతి ఘటనపై కేసు నమోదు, కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ భూముల కోసం రైతుల పోరుబాట * అర్థనగ్న ప్రదర్శనతో నిరసన.. గ్రామసభను అడ్డుకున్న రైతులు కాంగ్రెస్ కార్యదర్శి, ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం అప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా అదరగొడుతున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? సలుగుపల్లి లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు:

జర్నలిస్టుల ఆందోళనను విజయవంతం చేయాలి

Select Suryaa Now
జర్నలిస్టుల ఆందోళనను విజయవంతం చేయాలి

ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మురళీధర్

మేడ్చల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 1): జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అక్టోబర్ 2న కూకట్‌పల్లిలో నిర్వహించనున్న శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు మండల మురళీధర్ పిలుపునిచ్చారు.టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేపీహెచ్‌బీ మెయిన్‌రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకరమన్నారు.జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం గతంలో అమల్లో ఉన్న హెల్త్ స్కీంను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడంతో పాటు వేతన బోర్డు, జర్నలిస్టుల రక్షణ చట్టాలను అమలు చేయాలని కోరారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ శాంతియుత ఆందోళనలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మురళీధర్ కోరారు. 

రిపోర్టర్ తలారి శివకుమార్.