BREAKING
నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత ఎన్ఫోర్స్మెంట్ చర్యలు బొగ్గు బట్టీల్లో వెట్టిచాకిరీకి విముక్తి నల్గొండలో జర్నలిస్టుల నిరసనలు గాంధీ విగ్రహానికి వినతి పత్రం. చిన్నారులకు పౌష్టికాహారం.. ‘తొలి ముద్ద’కు శ్రీకారం గాంధీజీ జీవితం ఆదర్శనీయం -ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి : జెసి ఆర్.గోవింద రావు గాంధీ బాటలోనే స్వచ్ఛ గ్రామ స్వరాజ్యం.. బెజ్జుర్ మండలకేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు... జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి . సీమ రూపురేఖలు మార్చబోతున్నగ్లోబల్ హార్టికల్చర్ హబ్ వికలాంగులకు ర్యాంప్‌ ఏదీ? అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఉమ్మడి రవాణా పాస్ గాంధీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం సత్యం, అహింసా మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలి…. - నగర మేయర్ ధర్ని మధుకర్ సీఎం డిప్యూటీ సీఎంతో అనంత్ అంబానీ బేటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి* ** ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రసాద్

గాంధీజీ ఆశయాలు జీవితంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి -జిల్లా అదనపు ఎస్పి నోముల వెంకటేశ్వర్లు

Select Suryaa Now
గాంధీజీ ఆశయాలు జీవితంలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి  -జిల్లా అదనపు ఎస్పి నోముల వెంకటేశ్వర్లు

 మహాత్మా గాంధీ  అందించిన అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి, పోలీస్ వ్యవస్థకు ఎంతో మార్గదర్శకమని, గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవర్చుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు  మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజా సేవకు పోలీసులు నిబద్ధతతో కృషి చేయడమే గాంధీజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ జగన్, ఎస్ఐలు రమేష్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు ప్రశాంత్, గౌస్ పాషా, శివాజీలతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పి. వినయ్ కుమార్. నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్