వికలాంగులకు ర్యాంప్ ఏదీ?
-8 జిల్లాల కీలక దేవాదాయ శాఖ కార్యాలయాలకు మెట్లే ప్రధాన మార్గం
-మెట్లు ఎక్కలేక దివ్యాంగులు, వృద్ధుల అవస్థలు
కర్నూలు : ప్రజలకు సేవలందించే దేవాదాయ శాఖ కార్యాలయానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు ప్రవేశం కష్టంగా మారింది. కర్నూలులోని డిప్యూటీ కమిషనర్ దేవాదాయ శాఖ కార్యాలయ భవనంలో ప్రత్యేక ర్యాంప్ లేకపోవడంతో వీల్‌చైర్‌పై వచ్చే దివ్యాంగులు, మెట్లు ఎక్కలేని వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ భవనంలో 8 జిల్లాలకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలతో పాటు ఇంజినీరింగ్ కార్యాలయం, జువెలరీ వెరిఫికేషన్ అధికారి కార్యాలయం, కర్నూలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజూ పలువురు ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. అయితే భవనంలోకి ప్రవేశించేందుకు మెట్లే ప్రధాన మార్గంగా ఉండటంతో దివ్యాంగులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు.
స్పందించాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులు, వృద్ధులకు సులభంగా ప్రవేశించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి కార్యాలయ ప్రవేశం వద్ద నిబంధనలకు అనుగుణంగా ర్యాంప్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.