BREAKING
అనకాపల్లిలో తమ డిమాండ్లతో హోమ్ మినిస్టర్ కు వినతి పత్రం అందించిన విలేఖరులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతిపత్రం.. గుంట్లపేట్‌లో రీ-సర్వే పనుల పరిశీలన మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. హార్టికల్చర్ హబ్ సీమ రూపురేఖలు మార్పు -రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం పాతబస్తీ లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది* – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డ్రై డే నాడు కూడా మద్యం ఏరు... బీసిల రిజర్వేషన్లపై రాద్ధాంతం తగదు బిజెపి నేత గాలి హరిప్రసాద్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మునుగోడులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. ధర్మవరంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు * గాంధీజీ ఆశయ సాధనకు తెదేపా కట్టుబడి ఉంది: ధర్మవరం తెదేపా నాయకులు * స్థానిక ఎన్నికలను అడ్డుకుంటూ బీసీల రాజ్యాధికారాన్ని కాలరాస్తున్న వైకాపా * బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుకెళ్లడం వైకాపా నైజం: తెదేపా ధ్వజo జీలుగుమిల్లి మండలం దర్భగూడెం లో ఇటివల జరిగిన పిల్లెం. వెంకయ్య హత్య కేసు ను చేధించిన పోలీసులు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి

గాంధీజీ జీవితం ఆదర్శనీయం -ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి : జెసి ఆర్.గోవింద రావు

Select Suryaa Now
గాంధీజీ జీవితం ఆదర్శనీయం -ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి : జెసి ఆర్.గోవింద రావు

మహాత్మా గాంధీ జీవితం ఆయన ఆచరించిన విలువలో ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గాంధీ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ సత్యం, అహింసా సిద్ధాంతాలను ఆచరిస్తూ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత మార్గాలు నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జీవితం, ఆయన ఆచరించిన విలువలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. సత్యం, అహింస, సమానత్వం, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆశయాలను జీవితంలో పాటిస్తూ, సమాజంలో సానుకూల మార్పుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.