BREAKING
మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. హార్టికల్చర్ హబ్ సీమ రూపురేఖలు మార్పు -రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం పాతబస్తీ లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది* – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డ్రై డే నాడు కూడా మద్యం ఏరు... బీసిల రిజర్వేషన్లపై రాద్ధాంతం తగదు బిజెపి నేత గాలి హరిప్రసాద్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మునుగోడులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. ధర్మవరంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు * గాంధీజీ ఆశయ సాధనకు తెదేపా కట్టుబడి ఉంది: ధర్మవరం తెదేపా నాయకులు * స్థానిక ఎన్నికలను అడ్డుకుంటూ బీసీల రాజ్యాధికారాన్ని కాలరాస్తున్న వైకాపా * బీసీలకు 34% రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుకెళ్లడం వైకాపా నైజం: తెదేపా ధ్వజo జీలుగుమిల్లి మండలం దర్భగూడెం లో ఇటివల జరిగిన పిల్లెం. వెంకయ్య హత్య కేసు ను చేధించిన పోలీసులు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవం సత్యం.. అహింసే గాంధీజీ చూపిన మార్గం: కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మొబైల్ షాప్ యజమానులతో అవగాహన సమావేశం**

అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఉమ్మడి రవాణా పాస్

Select Suryaa Now
అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఉమ్మడి రవాణా పాస్

హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఒక అద్భుతమైన వార్త. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో, అలాగే 4.50 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. బస్సు దిగి మెట్రో ఎక్కే వారికి, లేదా మెట్రో దిగి బస్సుల్లో ప్రయాణించే వారికి ప్రతిసారీ క్యూ లైన్లలో నిలబడే తిప్పలు తప్పుతాయి. ఈ సింగిల్ కార్డ్/పాస్ విధానం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా ప్రయాణం ఎంతో హాయిగా సాగుతుంది.ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు మరియు ఆర్టీసీ బస్సుల్లో వేర్వేరుగా టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, రెండింటికీ కలిపి ఒకే ఒక్క 'కామన్ ట్రావెల్ పాస్' (ఉమ్మడి పాస్) విధానాన్ని ఈరోజు, అక్టోబర్ 2, 2026 న అధికారికంగా ప్రారంభించింది.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రజా భవన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కామన్ పాస్ విధానాన్ని, అలాగే డిజిటల్ టికెటింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'మీ టికెట్' (MeeTicket) మొబైల్ యాప్‌ను ప్రారంభించారు.

ఈ ఉమ్మడి పాస్ గురించిన పూర్తి వివరాలు,
ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు ఇందులో రెండు రకాల పాస్‌లను అందుబాటులోకి తెచ్చారు:
పాస్ రకం                                      మొత్తం ధర    మెట్రో వాటా    ఆర్టీసీ వాటా
రోజువారీ పాస్ (Daily Pass)              ₹400                ₹300               ₹100
నెలవారీ పాస్ (Monthly Pass)          ₹8,500              ₹7,000           ₹1,500

ఈ కామన్ పాస్‌తో పాటు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ప్రయాణికుల కోసం 'MeeTicket' అనే సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా:
• ప్రయాణికులు తమ మొబైల్‌లోనే పేపర్‌లెస్ డిజిటల్ బస్ టికెట్లు లేదా పాస్‌లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.
• దీనితో పాటు కేవలం బస్సుల్లో మాత్రమే ప్రయాణించే వారి కోసం ₹600 ధరతో వీక్లీ బస్ పాస్‌ను కూడా ఈ యాప్ ద్వారా అందిస్తున్నారు

ఈ పాస్ ఎక్కడెక్కడ చెల్లుతుంది?

మెట్రోలోని మూడు కారిడార్లలో ఈ పాస్ చెల్లుతుంది,.ఔటర్ రింగ్ రోడ్  పరిధిలో తిరిగే అన్ని రకాల సిటీ బస్సు సర్వీసులలోనూ ఈ కామన్ పాస్‌ను ఉపయోగించవచ్చు
విమానాశ్రయానికి నడిచే 'పుష్పక్' , ఏసీ బస్సులకు మాత్రం ఈ పాస్ వర్తించదు.