BREAKING
గాంధీజీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం రాజకీయ కక్షలతో 'శిల్పా' సేవలను ఆపలేరు: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వర్ష బాధితులకు ‘సత్యసాయి ట్రస్ట్’ అండ - రేషన్ పంపిణీ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వర్కర్స్ కు కనీస వేతనాలు అమలు చేయాలని వినతి సత్యం, అహింస, సేవా మార్గంలో మనమందరం ముందుకు సాగుదాం. గాంధీజీ జీవితం నుంచి ఓర్పు, సహనం* *జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి* అనకాపల్లిలో తమ డిమాండ్లతో హోమ్ మినిస్టర్ కు వినతి పత్రం అందించిన విలేఖరులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతిపత్రం.. గుంట్లపేట్‌లో రీ-సర్వే పనుల పరిశీలన మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. హార్టికల్చర్ హబ్ సీమ రూపురేఖలు మార్పు -రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం పాతబస్తీ లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది* – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డ్రై డే నాడు కూడా మద్యం ఏరు... బీసిల రిజర్వేషన్లపై రాద్ధాంతం తగదు బిజెపి నేత గాలి హరిప్రసాద్

బొగ్గు బట్టీల్లో వెట్టిచాకిరీకి విముక్తి

Select Suryaa Now
బొగ్గు బట్టీల్లో వెట్టిచాకిరీకి విముక్తి

 సూర్య కలెక్టరేట్ రిపోర్టర్ అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల్లో బొగ్గు బట్టీలపై అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 95 మంది ఆదివాసీ వలస కూలీలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు. వీరిలో మహిళలు, వృద్ధులతో పాటు మూడో వంతుకు పైగా చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాకు చెందిన వీరిని అడ్వాన్సుల పేరుతో నిర్బంధించి బలవంతంగా పని చేయిస్తున్నట్లు కూలీలు వెల్లడించారు 


అధికారులు వీరికి విడుదల పత్రాలు అందజేసి, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల ద్వారా స్వస్థలమైన రాయ్‌గడ్ జిల్లాకు తరలించారు. వెట్టిచాకిరీ నిరోధక చట్టం కింద యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. జిల్లాలోని ఇటుక బట్టీలు, క్వారీలు, రైస్ మిల్లులు, వ్యవసాయ క్షేత్రాల్లోనూ త్వరలో విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు కార్మిక శాఖ అధికారులు తెలిపారు.

వేణుగోపాల్ నేటి దినపత్రిక