BREAKING
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ నేటి యువత కు ఆదర్శం* * డీసీసీబీ చైర్మన్ నాగార్జున గాంధీజీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం రాజకీయ కక్షలతో 'శిల్పా' సేవలను ఆపలేరు: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వర్ష బాధితులకు ‘సత్యసాయి ట్రస్ట్’ అండ - రేషన్ పంపిణీ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వర్కర్స్ కు కనీస వేతనాలు అమలు చేయాలని వినతి సత్యం, అహింస, సేవా మార్గంలో మనమందరం ముందుకు సాగుదాం. గాంధీజీ జీవితం నుంచి ఓర్పు, సహనం* *జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి* అనకాపల్లిలో తమ డిమాండ్లతో హోమ్ మినిస్టర్ కు వినతి పత్రం అందించిన విలేఖరులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతిపత్రం.. గుంట్లపేట్‌లో రీ-సర్వే పనుల పరిశీలన మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. హార్టికల్చర్ హబ్ సీమ రూపురేఖలు మార్పు -రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హబ్ లక్ష్యం పాతబస్తీ లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తోంది* – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డ్రై డే నాడు కూడా మద్యం ఏరు...

నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత ఎన్ఫోర్స్మెంట్ చర్యలు

Select Suryaa Now
నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృత ఎన్ఫోర్స్మెంట్ చర్యలు

-రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన

-నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా రహదారి ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించడం, ముందస్తు నేరాలను అరికట్టడం, నిషేధిత వస్తువుల అక్రమ రవాణా మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS గారు పోలీస్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పోలీసులు సెప్టెంబర్ మాసంలో విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై

*1).* డ్రంకన్ అండ్ డ్రైవ్‌పై 914 కేసులు నమోదు చేశారు.
*2).* ఓపెన్ డ్రింకింగ్‌పై 1,204 కేసులు నమోదు చేశారు.
*3).* మైనర్ డ్రైవింగ్‌పై 160 కేసులు నమోదు చేశారు.
*4).* రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు మరియు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 83 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగిస్తూ, ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. అదే విధంగా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలు, నిషేధిత వస్తువుల అక్రమ రవాణా మరియు ఇతర నేరాలను అరికట్టేందుకు నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నంద్యాల జిల్లా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS గారు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే సంబంధిత పోలీసులకు లేదా 112 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు.