భీమ్‌గల్ పట్టణంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
సూర్య,భీమ్‌గల్ ;జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భీమ్‌గల్ పట్టణంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యులు బండ కిషన్ గుప్తా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్మరణీయమన్నారు. సత్యం, అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
దేశం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, స్వచ్ఛత, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో నడవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని బండ కిషన్ గుప్తా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు, నాయకులు, స్థానికులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.