జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి .
హనుమాన్ జంక్షన్, అక్టోబర్ 2, మేజర్ న్యూస్.
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జర్నలిస్టుల నేషనల్ డిమాండ్స్ డే సందర్భంగా రాజశేఖర్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గం బాపులపాడు మండల పాత్రికేయులు బాపులపాడు తహశీల్దారు కార్యాలయం వద్ద శుక్రవారం తమ కోర్కెల సాధనకు శుక్రవారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ… పాత్రికేయులకు ప్రమాద భీమా అమలు చేయాలని, జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన వేజ్ బోర్డు అమలు చేయాలని, పాత్రికేయులు సంక్షేమ నిధి అమలు చేయటంతోపాటు, పాత్రికేయులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం బాపులపాడు మండలం రెవిన్యూ ఇనస్పెక్టర్ గోపికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు అక్కినేని శ్రీనివాస ఫణీంద్ర, పల్లెపు అంకబాబు, మలిశెట్టి సుబ్రహ్మణ్యం, కాలి కిరణ్, ధారావతు రాజగోపాల్, నూకల శ్రీకాంత్, రెడ్డి రఘుబాబు, దాసరి చెంచు కృష్ణ, కొమ్మూరి పవన్ కుమార్, రెడ్డి రవిబాబు, నల్లగంచు శ్రీరామ కృష్ణ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.