గాంధీ ఆశయాలే దేశ ప్రగతికి మార్గదర్శకం
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్డులో శుక్రవారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ చావిడి, నూతనంగా ఆధునికీకరించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌రావు కలిసి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, OUDA చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.